ఆయనకు ఆయనే సాటి...మా ఆయన బంగారం:జయాబచ్చన్ | is the hero in real life also | Sakshi
Sakshi News home page

ఆయనకు ఆయనే సాటి...మా ఆయన బంగారం:జయాబచ్చన్

Published Tue, Apr 22 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

is the hero in real life also

ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టం. వెండితెర మీదే కాదు నిజజీవితంలోనూ ఆయన హీరోనే. నిగర్వమే ఆయన విజయ రహస్యం. తాను ఎంచుకునే నిర్ణయాలలో వేలెత్తి చూపే తప్పేమీ కనబడదు. తనకు నచ్చిన పని మాత్రమే చేస్తారు. ‘నేను అమితాబ్‌బచ్చన్’ అని ఆయన ఎప్పుడూ తనకు తాను గర్వంగా చెప్పుకోరు. సామాన్యుడిలా ఆలోచిస్తారు. ప్రవర్తిస్తారు.
 
 విజయం అనేది ఎప్పుడూ ఆయనను ప్రభావితం చేయలేదు. జయాపజయాల్లో ఒకేవిధంగా ఉంటారు. తాను చెప్పినదాన్ని నిజాయితీగా నమ్ముతారు. చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు...ఒక పని చేస్తున్నారంటే శ్రద్ధతో కష్టపడి చేస్తారు.
 
 చాలామంది యువ దర్శకులు అమిత్‌కు కథలు చెబుతుంటారు. వద్దనడానికి ఆయనకు మొహమాటం. వేరే ఎవరైనా అయితే ‘‘ఇది నా స్థాయికి తగిన పాత్ర కాదు’’ ‘‘ఈ పాత్ర నాకు చెడ్డ పేరు తెస్తుంది’’ ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. ఆయన మాత్రం ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు.
 
 ఒకసారి ఈ విషయం గురించి అడిగితే-
 ‘‘పాపం ఆ డెరైక్టర్ కుర్రాడు... పూర్తిగా నా మీదే ఆధారపడినట్లున్నాడు’’ అన్నారు. ఇక ఓపిక విషయంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం.
 - జయాబచ్చన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement