డాన్సులు చేసే వారితో నాకు పోలికా? | BJP distances itself from Naresh Agrawal's comment on 'those who dance and work in films' | Sakshi
Sakshi News home page

డాన్సులు చేసే వారితో నాకు పోలికా?

Published Tue, Mar 13 2018 2:33 AM | Last Updated on Tue, Mar 13 2018 2:33 AM

BJP distances itself from Naresh Agrawal's comment on 'those who dance and work in films' - Sakshi

నరేశ్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)కి చెందిన రాజ్యసభ సభ్యుడు నరేశ్‌ అగర్వాల్‌ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సినీ నటి, రాజకీయ నేత జయా బచ్చన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరిన సందర్భంగా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..‘సినిమాల్లో నటించే వారితో, డ్యాన్స్‌ చేసే వారితో పోలుస్తూ ఆ స్థాయికి నన్ను సమాజ్‌వాదీ పార్టీ దిగజార్చింది..నాకు పార్టీ టికెట్‌ నిరాకరించటం సబబు కాదు’ అని జయాబచ్చన్‌పై, సమాజ్‌ వాదీ పార్టీపై మండిపడ్డారు. జయ కారణంగా తనకు రాజ్యసభ అవకాశం చేజారిందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ స్పష్టంచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement