అన్ని అవార్డులూ ఇవ్వొచ్చు
బీజేపీ ఎంపీలపై జయ విసుర్లు
న్యూఢిల్లీ: పార్లమెంటు ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలది నటనేనని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఆరోపించారు. వారి నటనా పటిమకు అన్ని అవార్డులూ ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాం«దీ, ఇతర కాంగ్రెస్, విపక్షాల ఎంపీల తోపులాటలో గాయపడ్డట్టు బీజేపీ సభ్యులు ప్రతాప్‌చంద్ర సారంగీ, ముకేశ్ రాజ్‌పుత్ చెప్పడం తెలిసిందే. రాహుల్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఫాంగ్నాన్ కొన్యాక్ ఆరోపించారు.
శుక్రవారం విపక్షాల ఆందోళన సందర్భంగా జయ మీడియాతో మాట్లాడుతూ వారి తీరును తీవ్రంగా ఆక్షేపించారు. వాళ్లకంటే మెరుగైన నటులను తన కెరీర్లోనే చూడలేదంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘‘రాజ్‌పుత్‌కు తొలుత చిన్న బ్యాండేజీ వేశారు. తర్వాత దాని సైజు పెరిగింది. చివరికి చూస్తే ఐసీయూలో తేలారు. ఎంత అద్భుతమైన నటనో!’’ అంటూ దుయ్యబట్టారు. జయ విమర్శలపై బీజేపీ మండిపడింది. ‘‘బాధితులను వదిలి నిందితుని పక్షం వహించడమా? సమాజ్‌వాదీ పార్టీ సంస్కృతికి, విపక్ష ఇండియా కూటమి సంస్కృతికి ఇది మరో నిదర్శనం’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment