కూతురుతో సహా భర్త ఇంటి నుంచి బయటకొచ్చేసిన ఐశ్వర్య రాయ్‌ | Aishwarya Rai Has Moved Out Of The Bachchan Home | Sakshi
Sakshi News home page

కూతురుతో సహా భర్త ఇంటి నుంచి బయటకొచ్చేసిన ఐశ్వర్య రాయ్‌..?

Published Fri, Dec 15 2023 5:22 PM | Last Updated on Fri, Dec 15 2023 6:20 PM

Aishwarya Rai Has Moved Out Of The Bachchan Home - Sakshi

బాలీవుడ్‌లో అందరూ ఇష్టపడే జంటలలో ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్‌లు ముందు వరసలో ఉంటారు. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ ప్రస్తుతం తమ వివాహ విషయంలో చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు రూమర్స్‌ వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ విడిపోతున్నారని పలుమార్లు పుకార్లు వచ్చాయి. అయినప్పటికీ, వారు దానిపై ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు.

తాజాగా ఐశ్వర్య రాయ్‌ గురించి బాలీవుడ్‌ మీడియా పలు కథనాలు ప్రచురిస్తుంది. అవి నిజమేనంటూ బలంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ను తీసుకుని తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు కథనాలు వస్తున్నాయి. భర్తతో చాలా కాలంగా విభేదాలు ఉండటంతో అవి ఇక భరించలేనని ఆమె తన అమ్మగారి ఇంటికి చేరుకుందట. అత్తగారి ఇంట్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తల్లి చెప్పుకుందట. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తన అత్తగారు అయిన జయా బచ్చన్‌తో చాలా ఏళ్లుగా కనీసం మాటలు కూడా లేవని ఐశ్వర్య చెప్పినట్లు సమాచారం.

ఇదే క్రమంలో భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కూడా విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చిందట. ఇలాంటి గొడవల మధ్య తన కూతురును పెంచడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని భావించే ఐశ్వర్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వారిద్దరూ ఇప్పట్లో విడాకుల వరకు మాత్రం వెళ్లే పరిస్థితి లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కొద్దిరోజుల క్రితం ఐశ్వర్య రాయ్‌ తన 50వ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆమె తన తల్లి, కుమార్తెతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్‌ కూడా చాలా సింపుల్‌గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం తను ధరించడం లేదని తెలిసింది. దీంతో వారి అభిమానుల్లో కొంతమేరకు ఆందోళన మొదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement