సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్‌ ఆంటోనీ భార్య | Vijay Antony Wife Fatima Emotional Words About Daughter Meera, Says Iam Drowning And Dying With Your Thoughts - Sakshi

Vijay Antony Wife Fatima: కుమార్తెను తలుచుకుని విజయ్‌ ఆంటోనీ భార్య ట్వీట్‌.. చచ్చిపోతున్నా అంటూ..

Oct 9 2023 5:56 PM | Updated on Oct 9 2023 6:06 PM

Vijay Antony Wife Fatima Emotional Words For Meera - Sakshi

సినీ నటుడు విజయ్‌ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది.ఈ ఘటనతో వారి కుటుంబం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేని స్థితిలో ఉంది. మీరా మరణానంతరం మరో కుమార్తె లారా ఆంటోనీని తాము వెళుతున్న అన్ని చోట్లకు విజయ్ ఆంటోనీ దంపతులు తీసుకెళ్తున్నారు. తాజాగా విజయ్‌ కొత్త సినిమా ప్రమోషన్‌ కార్యక్రమానికి కూడా తన రెండో కుమార్తె లారాను వెంటబెట్టుకుని వెళ్లారు.

(ఇదీ చదవండి: ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్‌ ఇచ్చిన అరియాన)

విజయ్ ఆంటోనీ  పలు సినిమాలతో నిత్యం బిజీగా ఉండటం వల్ల ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా వారి సొంత నిర్మాణ సంస్థ బాధ్యతలు స్వీకరించి అన్నీ తానై నడిపిస్తోంది.  అలా నిత్యం వారిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు. ఇప్పటికే విజయ్‌ నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల భాద్యతలను ఫాతిమానే దగ్గరుండి చూశారు. అలా సినిమా నిర్మాణ రంగంలో ఆమెకు మంచి అనుభవంతో పాటు గుర్తింపు ఉంది.

కుమార్తె మీరా మరణం నేపథ్యంలో ఫాతిమా ఆంటోనీ తాజాగా  ట్వీట్ చేశారు. మీరాను మరోసారి గుర్తుచేసుకుని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. 'నువ్వు  16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే.. నిన్ను నాకు మరింత దగ్గరగా ఉంచుకునే దానిని. కనీసం నిన్ను సూర్యచంద్రులకు కూడా చూపించకుండా నేను దాచుకునే దాన్ని. ప్రస్తుతం నువ్వు మా మధ్య లేకపోవడంతో ఎప్పుడూ నీ ఆలోచనలలో మునిగిపోయి చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా మేము జీవించడం కష్టంగా ఉంది. ఈ అమ్మ- నాన్న దగ్గరకి తిరిగి వచ్చేయ్ అమ్మా.. నీ కోసం నీ చెల్లెలు ఎదురుచూస్తూనే ఉంది. లవ్ యు తంగం.' అని  తన ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement