'మీరా బంగారం..' విజయ్‌ ఆంటోని భార్య ఎమోషనల్‌ పోస్ట్‌ | Fatima Vijay Antony Emotional Tweet About Her Daughter Meera | Sakshi
Sakshi News home page

Fatima Vijay Antony: బంగారు తల్లీ.. నిన్ను కలిసేవరకు నాకీ శోకం తప్పదు.. విజయ్‌ ఆంటోని భార్య ఎమోషనల్‌

Dec 11 2023 12:52 PM | Updated on Dec 11 2023 1:19 PM

Fatima Vijay Antony Emotional Tweet About Her Daughter Meera - Sakshi

ఇప్పటికీ మేమిది నమ్మలేకపోతున్నాం. నీ స్పర్శ కోసం నీ పియానో ఎదురుచూస్తోంది తల్లీ.. నీ అమ్మను నేనిక్కడ ఉంటే నన్ను కాదని వెళ్లిపోయావా.. బహుశా ఈ ప్రపంచం

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కాసేపు కనిపించకపోతేనే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది చిన్నవయసులోనే కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు హీరో విజయ్‌ ఆంటోని దంపతులు. ఇటీవల విజయ్‌ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

మీరా బంగారం..
నవ్వుతూ తుళ్లుతూ కళ్లముందు తిరిగే కూతురు ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు విజయ్‌, అతడి భార్య ఫాతిమా ఆంటోని. తాజాగా ఫాతిమా.. మీరాను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మీరా బంగారం.. ఎందుకింత త్వరగా వెళ్లిపోయావమ్మా.. ఇప్పటికీ మేమిది నమ్మలేకపోతున్నాం. నీ స్పర్శ కోసం నీ పియానో ఎదురుచూస్తోంది తల్లీ.. నీ అమ్మను నేనిక్కడ ఉంటే నన్ను కాదని వెళ్లిపోయావా.. బహుశా ఈ ప్రపంచం నీ కోసం కాదేమో!

నిన్ను కలిసేవరకు..
ఈ చావుబతుకుల మధ్య ఉండే గీత నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను కలిసేవరకు ఈ బాధ నాకు తప్పదు. అక్కడ బాగా తిని విశ్రాంతి తీసుకో అమ్మా. లారా(మీరా చెల్లెలు) కూడా నిన్ను ఎంతో మిస్‌ అవుతోంది..' అంటూ ఎక్స్‌(ట్విటర్‌)లో కూతురితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌ వైరల్‌గా మారగా బాధపడకండి మేడమ్‌ అంటూ నెటిజన్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

చదవండి: సినీ నటితో 'యానిమల్‌' నటుడి వివాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement