
గార్గేయి యల్లాప్రగడ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘హలో మీరా’. శ్రీనివాసు కాకర్ల దర్శకత్వం వహించారు. జీవన్ కాకర్ల సమర్పణలో డా.లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. ‘‘తెల్లవారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన మీరా పెళ్లి వద్దనుకుని కారులో హైదరాబాద్ బయలుదేరుతుంది.
ఆ తర్వాత మీరా పరిస్థితి ఏంటి? అన్నది ఆసక్తిగా ఉంటుంది. సస్పెన్స్ డ్రామా, థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. అతి త్వరలో మూవీ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్. చిన్న, కెమెరా: ప్రశాంత్ కొప్పినీడి.
Comments
Please login to add a commentAdd a comment