యువతకు సందేశం
యువతకు సందేశం
Published Sun, Feb 16 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
‘ప్రేమిస్తే’ లాంటి ప్రేమకథా చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి, ఇప్పటివరకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై ఆయన అందిస్తున్న పదవచిత్రం ‘ప్రేమించాలి’. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ - ‘‘చిన్నపిల్లలు వీధులపాలవుతున్న సంఘటనలను వింటున్నాం.. చూస్తున్నాం. అసలు పిల్లలు అలా వీధులపాలవడానికి కారణం ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. హృదయానికి హత్తుకునే ఈ ప్రేమకథకు సెన్సార్ బోర్డ్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమా అనీ ప్రేక్షకుల కంట తడిపెట్టించే సినిమా అని భాస్కరభట్ల తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని సురేష్‌తో కలిసి ‘పిజ్జా’ చిత్రాన్ని విడుదల చేసిన సమన్యరెడ్డి అన్నారు.
Advertisement
Advertisement