అనుకోని మలుపు! | Vijay Antony as killer doctor in Salim | Sakshi
Sakshi News home page

అనుకోని మలుపు!

Published Mon, Jan 19 2015 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

అనుకోని మలుపు!

అనుకోని మలుపు!

అతను మంచి డాక్టర్. రోగుల ప్రాణాలను కాపాడటానికి అహర్నిశలూ కృషి చేస్తాడు. అలాగే బోల్డన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇతరులు అసూయపడే స్థాయికి ఎదుగుతాడు. హాయిగా సాగుతున్న ఆ డాక్టర్ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏంటి? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డా. సలీమ్’. విజయ్ ఆంటోని టైటిల్ రోల్‌ని పోషించి, సంగీతదర్శకునిగా వ్యవహరించిన ఈ చిత్రంలో అక్ష కథానాయిక.
 
 నాగప్రసాద్ సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ మరియు ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కొండేటి, తమటం కుమార్ రెడ్డి అందిస్తున్న ఈ చిత్రం పాటలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతూ - ‘‘విజయ్ ఆంటోని నటన, ఆయన స్వరపరచిన పాటలు, సాహితి రాసిన పాటలు, సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ థ్రిల్లర్ అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్, దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్‌కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement