kumar reddy
-
కిరణ్‌కుమార్‌ను చిత్తుగా ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
-
చిత్తూరు అబ్బాయి, కశ్మీర్ అమ్మాయి.. బెర్లిన్‌లో ప్రేమ..
సాక్షి, పీలేరు(చిత్తూరు): బెర్లిన్‌లో ప్రేమించుకున్న ప్రేమజంటకు పీలేరులో వివాహం జరిగింది. పీలేరు మండలం కాకులారంపల్లెకు చెందిన కాకులారం మోహన్‌రెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డి గత మూడేళ్లుగా బెర్లిన్‌లోని చార్టీ రాష్ట్రంలో ఓ సైన్స్ పరిశోధనా కేంద్రంలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. అక్కడే కశ్మీర్‌కు చెందిన రూఫ్‌కిషన్ రైనా కుమార్తె షికా రైనా కూడా బెర్లిన్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో కుమార్‌రెడ్డి, షికా రైనాలు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించడంతో ఆదివారం స్థానిక పీలేరు ఎంఎన్ఆర్ కల్యాణమండపంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. చదవండి: (ట్రైనింగ్‌లో మొగ్గతొడిగిన ప్రేమ.. పెద్దల సమక్షంలో ఎస్ఐల పెళ్లి) -
బీటెక్ చదివి.. జల్సాలకు అలవాటు పడి...
అన్నం పెట్టిన సంస్థకే కన్నం జ్యూయలరీ షాపులో 350 గ్రాముల బంగారు బిస్కట్లు అపహరణ గుట్టు విప్పిన సీసీ కెమెరా యువకుడి కి రిమాండ్ అల్లిపురం : యువత చెడువ్యసనాలకు అలవాటు పడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలిపే ఓ సంఘటన ఇది. బీటెక్ చదివిన కుర్రాడు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఓ జ్యూలరీ షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ, వ్యసనాలకు అలవాటుపడి.. సంపాదన చాలక అన్నం పెడుతున్న సంస్థకే కన్నం పెట్టాడు. ఫలితంగా ఆ యువకుడిని త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి 350 గ్రాముల బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ టి. రవికుమార్‌మూర్తి కేసు వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, తలారి చెరువు గ్రామానికి చెందిన జంగంరెడ్డి గారి కుమార్‌రెడ్డి బీటెక్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయే పెంచి పెద్ద చేశాడు. చదువు పూర్తయిన తరువాత ఈ ఏడాది జనవరి 21న విశాఖలోని తనిష్క్ జ్యూయలరీ షో రూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాడు. బాబాయికి దూరంగా ఉండటంతో మంచిచెడులు చెప్పేవారు లేక కుమార్ రెడ్డి దుర్వ్యసనాలపైపు ఆకర్షితుడయ్యాడు. గ్యాంబ్లింగ్, కేసినో బెట్టింగ్‌లతో జల్సాలకు అలవాటు పడ్డాడు. ఆదాయం చాలకపోవడంతో పనిచేస్తున్న సంస్థకు కన్నం వేయడానికి తెగించాడు. ఈ మేరకు గత నెల 26 షోరూం సిబ్బంది అంతా సమావేవంలో ఉండగా, పక్క గదిలో సొరుగు తెరిచి రూ.3.50లక్షల విలువ గల 350గ్రాముల బంగారు బిస్కట్లు దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్న సంస్థ సిబ్బంది త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడని శుక్రవారం ద్వారకా బస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా డీసీపీ టి.రవికుమార్‌మూర్తి మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలియకుండా, అపరిచిత వ్యక్తులను ఉద్యోగంలో పెట్టుకోవ ద్దని వ్యాపారులకు సూచించారు. -
అనుకోని మలుపు!
అతను మంచి డాక్టర్. రోగుల ప్రాణాలను కాపాడటానికి అహర్నిశలూ కృషి చేస్తాడు. అలాగే బోల్డన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇతరులు అసూయపడే స్థాయికి ఎదుగుతాడు. హాయిగా సాగుతున్న ఆ డాక్టర్ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏంటి? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డా. సలీమ్’. విజయ్ ఆంటోని టైటిల్ రోల్‌ని పోషించి, సంగీతదర్శకునిగా వ్యవహరించిన ఈ చిత్రంలో అక్ష కథానాయిక. నాగప్రసాద్ సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ మరియు ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కొండేటి, తమటం కుమార్ రెడ్డి అందిస్తున్న ఈ చిత్రం పాటలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతూ - ‘‘విజయ్ ఆంటోని నటన, ఆయన స్వరపరచిన పాటలు, సాహితి రాసిన పాటలు, సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ థ్రిల్లర్ అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్, దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్‌కుమార్. -
ఏసీబీ వలలో వీఆర్వో
ఓదెల : ఏసీబీ విసిరిన వలకు ఓదెల మండలం గుండ్లపల్లి వీఆర్వో పంగ రమేశ్ చిక్కాడు. గురువారం ఓ రైతు నుంచి గ్రామంలోని బస్టాండ్ కూడలిలో రూ.మూడు వేలు తీసుకుంటుండగా.. అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంఘటన వివరాలను ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తహశీల్దార్ కార్యాలయం లో విలేకరులకు వెల్లడించారు. మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి మల్లారెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డికి అదే గ్రామంలో 1269/బీ సర్వేనంబర్‌లో 1.25 ఎకరాలు, 1292/ఏ 1.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ సర్వేనంబర్లలోని భూమి మొత్తం అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి మల్లారెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డికి చెందిన సర్వేనంబర్ 56లో నమోదైంది. బాధితుడు కుమార్‌రెడ్డి పహాణి కోసం మీసేవకు వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పహాణిలో పేరు నమోదు చేయాలంటూ 2013 సెప్టెంబర్ 6న అప్పటి తహశీ ల్దార్ పద్మావతికి దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన ఆమె.. వీఆర్వో రమేశ్‌ను ఆదేశించారు. దీనికి రమేశ్ లంచం డిమాండ్ చేశా డు. ఇద్దరి మధ్య రూ.15వేలకు ఒప్పందం కుది రింది. మొదటి విడతగా కుమార్‌రెడ్డి ఆర్నెల్ల క్రితం రూ.ఐదు వేలు ముట్టజెప్పాడు. స్పందిం చకపోవడంతో రెండు నెలల క్రితం మరో రూ.రెండు వేలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులి స్తేనే.. అనడంతో ఏసీబీని ఆశ్రయించాడు. వలపన్ని పట్టుకున్న ఏసీబీ.. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రూ.మూడువేలను కుమార్‌రెడ్డితో పంపించారు. బాధితు డు ఫోన్ చేయగా.. తాను బస్టాండ్ కూడలిలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో కుమార్‌రెడ్డి అక్కడకు వెళ్లి ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.మూడు వేలను అందించాడు. వాటిని జేబులో పెట్టుకుంటుండగానే.. అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ఆయన వెంట సీఐలు రమణారెడ్డి, సతీష్‌చందర్, శ్రీనివాసరాజు, విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు. వేధిస్తే ఫిర్యాదు చేయండి.. - సుదర్శన్‌గౌడ్, డీఎస్పీ ఏసీబీ జిల్లాలో రెవెన్యూ శాఖ ఉద్యోగులపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. లంచం కోసం వేధిస్తే ఎంత పెద్ద వారైనా సరే ఫిర్యాదు చేయండి. అవినీతిపరులను పట్టుకుంటాం. ఎంతపెద్ద వారైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఏసీబీ ఫోన్ నంబర్.. 9440446150 ప్రాధేయపడినా వినలేదు తండ్రుల పేర్లు.. మా పేర్లు ఒకేలా ఉన్నాయి. పాస్‌బుక్‌లో (1006)లో నాపేరిట భూమి ఉన్నా.. పహాణిలో లేదు. దానిని మీ సేవలో ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్న. ఆమె వీఆర్వోకు చెప్పినా పట్టించుకోలేదు. పైగా రూ.20వేలు లంచం కావాలన్నడు. చేసేది లేక రూ.15వేలు ఒప్పుకున్న. ఆర్నెల్ల క్రితం రూ.ఐదు వేలు, రెండు నెలల క్రితం మరో రూ.రెండు వేలు ఇచ్చిన. డబ్బులు లేవు.. మీరే ఎలాగైనా దయ చూపండని వేడుకున్న. అయినా వీఆర్వో వినలేదు. అందుకే ఏసీబీకి పట్టిచ్చిన. - కుమార్‌రెడ్డి, బాధితుడు -
గంగుల ప్రభాకరరెడ్డిపై కేసు నమోదు
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై దాడి కేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత కుమార్ రెడ్డిపై గంగుల ప్రభాకరరెడ్డితోపాటు ఆయన అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో గుంగుల ప్రభాకరరెడ్డితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు విజయేంద్రానాథ్రెడ్డి, సుభాష్‌రెడ్డి, గంగులా విజయసింహారెడ్డిలతోపాటు మరో ఇద్దరి పేర్లను ఈ కేసులో చేర్చారు. కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆళ్లగడ్డ పోలీసులు తెలిపారు. -
బాబును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
ఇందుకూరుపేట, న్యూస్‌లైన్ : గాంధీజీ పోరాట పటిమ, అన్నాహజారే స్ఫూర్తితో ముందుకు పోతున్నానని బాబు ప్రజాగర్జనలో చేసిన ఉపన్యాసం విని రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన సిమెంట్ రోడ్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్టాంపులు, నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు, స్కాలర్షిప్లు, భూ కుంభకోణం, దొం గనోట్లు, ఎంసెట్, ఇంటర్ పేపర్ల లీకేజీలు చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నారు. ఇవన్నీ గాంధీజీ, అన్నాహజారే చేయమన్నారా? అని ప్రశ్నిం చారు. బాబు కుమారుడు లోకేష్ విదేశాల్లో చదువుకునేందుకు సత్యం రామలింగరాజు డొనేషన్ కట్టి చదివించిన విషయం మరిచిపోయారా?ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఎక్కడచూసినా నోట్ల కట్టల బస్తాలు ఉండేవని, రూ.500 నోట్ల కట్ట బస్తా ఒకటి పనిమనిషి ఇంట్లో పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి ఈ రోజు అవినీతి గురించి, అవినీతిని అంతం చేస్తామని మాట్లాడుతుంటే ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు, తెలుగువారందరు ఒకటిగా ఉండాలని కాకుండా చంద్రబాబు, కిరణ్ రాజకీయాల కోసం సర్వనాశనం చేస్తున్నారని ఆరోపిం చారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి నిర్ణయం ప్రకారం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తీర్మానించిన తర్వాతే శాసనసభను సజావుగా సాగనిస్తామన్నారు. లేనిపక్షంలో తమ నాయకురాలు వైఎస్ విజయమ్మతో కలసి జనవరి మూడో తేదీన నిర్వహించనున్న శాసనసభ సమావేశాలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, నాయకులు గునపాటి సురేష్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి విజయ్‌కుమార్, భీమవరపు వెంకటకృష్ణారెడ్డి, గురజాల బుజ్జిబాబు పాల్గొన్నారు.