ఇందుకూరుపేట, న్యూస్‌లైన్ : గాంధీజీ పోరాట పటిమ, అన్నాహజారే స్ఫూర్తితో ముందుకు పోతున్నానని బాబు ప్రజాగర్జనలో చేసిన ఉపన్యాసం విని రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన సిమెంట్ రోడ్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్టాంపులు, నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు, స్కాలర్‌షిప్‌లు, భూ కుంభకోణం, దొం గనోట్లు, ఎంసెట్, ఇంటర్ పేపర్ల లీకేజీలు చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నారు. ఇవన్నీ గాంధీజీ, అన్నాహజారే చేయమన్నారా? అని ప్రశ్నిం చారు. బాబు కుమారుడు లోకేష్ విదేశాల్లో చదువుకునేందుకు సత్యం రామలింగరాజు డొనేషన్ కట్టి చదివించిన విషయం మరిచిపోయారా?ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఎక్కడచూసినా నోట్ల కట్టల బస్తాలు ఉండేవని, రూ.500 నోట్ల కట్ట బస్తా ఒకటి పనిమనిషి ఇంట్లో పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఇలాంటి వ్యక్తి ఈ రోజు అవినీతి గురించి, అవినీతిని అంతం చేస్తామని మాట్లాడుతుంటే ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు, తెలుగువారందరు ఒకటిగా ఉండాలని కాకుండా చంద్రబాబు, కిరణ్ రాజకీయాల కోసం సర్వనాశనం చేస్తున్నారని ఆరోపిం చారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ప్రకారం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తీర్మానించిన తర్వాతే శాసనసభను సజావుగా సాగనిస్తామన్నారు. లేనిపక్షంలో తమ నాయకురాలు వైఎస్ విజయమ్మతో కలసి జనవరి మూడో తేదీన నిర్వహించనున్న శాసనసభ సమావేశాలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, నాయకులు గునపాటి సురేష్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి విజయ్‌కుమార్, భీమవరపు వెంకటకృష్ణారెడ్డి, గురజాల బుజ్జిబాబు పాల్గొన్నారు.
బాబును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
Published Wed, Jan 1 2014 4:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement