Cement roads
-
నాడు అధ్వానం..నేడు అద్భుతం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్లె దారుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడచూసినా సిమెంట్, తారురోడ్లు అందంగా దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అంతరాయం లేకుండా రోడ్లపై ప్రజలు, వాహనచోదకులు ప్రయాణం సాగిస్తున్నారు. సీతానగరం మండలం బూర్జ, గరుగుబిల్లి మండలం అజ్జాడ రహదారి గతంలో రోడ్లు ఆధ్వానంగా ఉండేవి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ నిధులు రూ.60లక్షలు మంజూరు చేయడంతో రోడ్లు నిర్మించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. – పార్వతీపురం టౌన్ సాఫీగా ప్రయాణం గతంలో వ్యాపారం నిమిత్తం ఈ రోడ్డుపై ప్రయాణం చేసేవాడిని. రహదారి సరిగాలేక వ్యాపారం మానుకునే పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈరోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగుతోంది. మళ్లీ వ్యాపారం ప్రారంభించాను. – గణేష్, బట్టల వ్యాపారస్తుడు, పార్వతీపురం -
31 లోగా సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలి
అధికారులతో జూపల్లి సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో మంజూరైన సిమెంట్ రహదారుల నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని అధికా రులను పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఉపాధి హామీ కింద జరుగు తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగ తిపై మంగళవారం ఆయన సమీక్షించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని వృథా కాకుండా సద్వినియోగం చేయాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం లోనూ పెద్దెత్తున ఉపాధి పనులు చేపట్టేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అధికారులు సమాయత్తం కావాలన్నారు. ప్రపంచవ్యా ప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంత్రి జూపల్లి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిం చారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
నరకం ... నరకం
పెద్దశంకరంపేట:గ్రామాల్లోని మట్టి రోడ్లు అధ్వానంగా మారాయి. అడుగడుగునా గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా సిమెంటు రోడ్లకు నోచుకోవడం లేదు. చిన్నపాటి వర్షాలకే బురదమయంగా మారి నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. మండల కేంద్రమైన పెద్దశంకరంపేటలోని మాధవ నగర్‌కు వెళ్లే దారే ఇందుకు నిదర్శనం. ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాలు పడితే నడక కూడా కష్టమే. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలవడం, వాహనాల రాకపోకల వల్ల దారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో రోడ్డు పక్క ఉన్న పొలాల్లో నడవాల్సి వస్తోంది. వర్షం పడిన పది పదిహేను రోజులు తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని పాదచారులు తెలిపారు. ఈ సమస్య పంచాయతీ సిబ్బంది, అధికారులకు తెలిసినా వారు రోడ్డు బాగు కోసం కృషి చేయడం లేదని ఆరోపించారు. గతంలో సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులను కోరినట్లు ప్రజలు తెలిపారు.] ప్రతి రోజూ వివిధ పనుల నిమిత్తం వందలాది మంది ఈ మార్గంలో కాలి నడకన రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు రోడ్డుపై నడిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు కూడా బురద కారణంగా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని వివరించారు. అంతేకాకుండా బురదలో వాహనం ఇరుక్కుపోతే దాన్ని బయటికి తీయడానికి పడరాని పాట్లు పడాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి రోడ్డును సీసీగా మార్చాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
సకాలంలో సిమెంటు రోడ్లు పూర్తి చేయండి
శ్రీకాకుళం టౌన్ : జిల్లాలో సిమెంటు రోడ్ల నిర్మాణానికి గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు చేయలేక పోయారు. ఇందుకు అనేక కారణాలు చూపారు. ఇప్పుటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించి సిమెంటు రోడ్ల నిర్మాణ లక్ష్యం పూర్తి చేయండి.. అంటూ జిల్లా కలెక్టరు డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన చాంబరులో డ్వామా పీడీ ఆర్.కూర్మనాథ్, పంచాయతీరాజ్ ఎస్ఈ మోహనమురళీ, ఐటీడీఏ పీఓ వెంకటరావుతో సమావేశమయ్యారు. సిమెంటు రోడ్ల నిర్మాణంపై పలు సూచనలు చేశారు. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు సిమెంటు రోడ్లు నిర్మించకోలేక పోవడంతో సుమారు రూ.40 కోట్లు వెనక్కు పంపాల్సి వచ్చిందని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈసారి లక్ష్యం 1200 కిలో మీటర్లు కాగా, ఇప్పటివరకు 221 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారని గుర్తు చేశారు. మిగిలిన లక్ష్యం పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఇసుక కొరత కారణంగా చూపించి, సిమెంటు రోడ్ల నిర్మాణంలో జాప్యం చేశారని, ఇప్పుడు నీరు కొరత ఉందని చెపుతున్నారని ఆయన ప్రస్తావించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు-2 పి.రజనీకాంతరావుతోపాటు డీఆర్ఓ కృష్ణభారతి పాల్గొన్నారు. -
ప్రతి ఊళ్లో సిమెంట్ రోడ్లు : సీఎం
హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని గ్రామాలలో రహదారులన్నీ సిమెంట్ రోడ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గ్రామాల అనుసంధాన రహదారులనూ అదేవిధంగా మార్చాలన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ప్రతి గ్రామంలో వాటర్ హార్వేస్టింగ్ స్ట్రక్చర్లు యుద్ధప్రాతిపదికన నిర్మించడంతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. రాబోయే నాలుగేళ్ల కాలంలో గ్రామాల రూపురేఖలే మారేలా ఆ ప్రాంతాల్లో అనూహ్య అభివృద్ధి చేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులు ఉపయోగించాలని సీఎం ఆదేశించారు. 13 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున చెత్త నుంచి విద్యుత్‌ను తయారీ చేసే కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 13,921 కి.మీ. మేర పంచాయతీ రహదారులను ఆధునికీకరణ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. 5- 10 వేల కి.మీ. గ్రామీణ ప్రాంతాల రహదారులను ఆర్ అండ్ బీ శాఖకు, ఈ-పంచాయతీల్లో ఆన్లైన్ సర్వీసులను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని సీఎం సూచించారు. -
నిధులువెనక్కేనా..!
బీఆర్జీఎఫ్ నిధులపై ప్రతిష్టంభన ప్రతిపాదనలకు చివరి తేదీ ఈనెల 30 నేటికీ సమావేశమవ్వని డీపీసీ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం సాక్షి, హన్మకొండ : అధికారుల అలసత్వం కారణంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్జీఎఫ్) వెనక్కి మళ్లే ప్రమాదం ఏర్పడింది. ఈ నిధుల కింద చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. గడువులోపే జిల్లా ప్రణాళికా కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ పనులపై చర్చ జరగాల్సి ఉంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రతిపాదనలు నేటికీ ఆమోదం పొందలేదు. సరికొత్త మార్గదర్శకాలు 2012-17 వరకు అమలు కావాల్సి ఉంది. ఈ పథకం ద్వారా కేటాయించే నిధులలో గ్రామ పంచాయతీలకు 50శాతం, మండల పరిషత్‌లకు 30శాతం, జిల్లా పరిషత్‌కు 20శాతం కేటాయిస్తారు. రెండో విడత కింద రూ.33కోట్ల వరకు నిధులు జిల్లాకు కేటాయించగా వీటిలో రూ.22కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, రూ.11 కోట్లు పట్టణ ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సి ఉంది. అంతకు ముందు బీఆర్జీఎఫ్-1 కింద 2007-12 వరకు మొదటి విడత అమలైంది. ఈ సమయంలో హైమాస్ట్‌లైట్లు, మురుగుకాల్వలు, సిమెంట్ రోడ్లకు అత్యధిక నిధులు కేటాయించడాన్ని రాష్ట్ర హైపవర్ కమిటీ తప్పుపట్టింది. హైమాస్ట్‌లైట్ల కొనుగోలుపై ఆడిట్ అభ్యంతరాలు సైతం వ్యక్తమయ్యాయి. దానితో మురుగు కాల్వలు, సిమెంట్ రోడ్లు, హైమాస్ట్‌లైట్లను ప్రతిపాదనల్లో చేర్చవద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలు, పాఠశాలల్లో కిచెన్షెడ్లు, మూత్రశాలలు, తాగు నీటి సౌకర్యాలు వంటి పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేశారు. జెడ్పీ అధికారుల నిర్లక్ష్యం 2012లో బీఆర్జీఫ్-2 అమలయ్యే నాటికి కొత్త పాలకవర్గం ఏర్పడ లేదు. అధికారుల పాలనే సాగింది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2014 ఏప్రిల్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా మే నెలలో ఫలితాలు వెలువడ్డాయి. ఆ వెంటనే బీఆర్జీఎఫ్-2 నిధులతో చేపట్టే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు జెడ్పీటీసీ సభ్యుల నుంచి తీసుకోవడంలో జిల్లా పరిషత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొత్త సభ్యులకు మార్గదర్శకాలు వివరించకుండా, గత అనుభవాలను పట్టించుకోకుండా ప్రతిపాదనలు తీసుకున్నారు. దానితో జెడ్పీటీసీ సభ్యులు పంపిన ప్రతిపాదనల్లో యాభై శాతానికి మించిన పనులు సీసీ రోడ్లు, డ్రెరుునేజీలకు సంబంధించినవే ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యులు పంపించిన ప్రతిపాదనలు బీఆర్జీఎఫ్-2 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే అంశాన్ని మూడు నెలలుగా జిల్లా అధికారులు గుర్తించలేదు. మరోవైపు గడువు తేదీ సెప్టెంబర్ 30 సమీపిస్తుండటంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. గతంలో జెడ్పీటీసీలు సమర్పించిన పనులను ఏకగ్రీవంగా ఆమోదించారు. డీపీసీ వాయిదా బీఆర్జీఎఫ్-2 పనుల ప్రతిపాదనలకు సంబంధిం చి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులకు, జెడ్పీటీసీలకు మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. దీన్ని సరిదిద్దడంపై అటు కలెక్టర్ సైతం దృష్టి సారించక పోవడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. దానితో ఈ ప్రతిపాదనలు విషయంలో ఏం చేయాలనే అంశంపై స్పష్టత రాకుండా పోయింది. జిల్లా కలెక్టర్ సభ్యుడిగా ఉండే జిల్లా ప్రణాళికా కమిటీ(డీపీసీ)లో చర్చించి ఆమోదం పొందేందుకు జెడ్పీటీసీ సభ్యులు బుధవారం యత్నించారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ఉందనే కారణంతో డీపీసీ సమావేశాన్ని కలెక్టర్ వాయిదా వేశారు. సమావేశం ఎప్పుడు నిర్వహించే తేదీని సైతం ఖరారు చేయలేదు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షురాలిగా ఉండే జిల్లా ప్రణాళికా కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వాయిదా వేయడం ఏమిటని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇదే తీరున ఆలస్యం జరిగితే నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. బీఆర్జీఎఫ్-2 పనుల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
బాబును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
ఇందుకూరుపేట, న్యూస్‌లైన్ : గాంధీజీ పోరాట పటిమ, అన్నాహజారే స్ఫూర్తితో ముందుకు పోతున్నానని బాబు ప్రజాగర్జనలో చేసిన ఉపన్యాసం విని రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన సిమెంట్ రోడ్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్టాంపులు, నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు, స్కాలర్షిప్లు, భూ కుంభకోణం, దొం గనోట్లు, ఎంసెట్, ఇంటర్ పేపర్ల లీకేజీలు చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నారు. ఇవన్నీ గాంధీజీ, అన్నాహజారే చేయమన్నారా? అని ప్రశ్నిం చారు. బాబు కుమారుడు లోకేష్ విదేశాల్లో చదువుకునేందుకు సత్యం రామలింగరాజు డొనేషన్ కట్టి చదివించిన విషయం మరిచిపోయారా?ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఎక్కడచూసినా నోట్ల కట్టల బస్తాలు ఉండేవని, రూ.500 నోట్ల కట్ట బస్తా ఒకటి పనిమనిషి ఇంట్లో పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి ఈ రోజు అవినీతి గురించి, అవినీతిని అంతం చేస్తామని మాట్లాడుతుంటే ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు, తెలుగువారందరు ఒకటిగా ఉండాలని కాకుండా చంద్రబాబు, కిరణ్ రాజకీయాల కోసం సర్వనాశనం చేస్తున్నారని ఆరోపిం చారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి నిర్ణయం ప్రకారం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తీర్మానించిన తర్వాతే శాసనసభను సజావుగా సాగనిస్తామన్నారు. లేనిపక్షంలో తమ నాయకురాలు వైఎస్ విజయమ్మతో కలసి జనవరి మూడో తేదీన నిర్వహించనున్న శాసనసభ సమావేశాలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, నాయకులు గునపాటి సురేష్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి విజయ్‌కుమార్, భీమవరపు వెంకటకృష్ణారెడ్డి, గురజాల బుజ్జిబాబు పాల్గొన్నారు.