గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్లె దారుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడచూసినా సిమెంట్, తారురోడ్లు అందంగా దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అంతరాయం లేకుండా రోడ్లపై ప్రజలు, వాహనచోదకులు ప్రయాణం సాగిస్తున్నారు.
సీతానగరం మండలం బూర్జ, గరుగుబిల్లి మండలం అజ్జాడ రహదారి గతంలో రోడ్లు ఆధ్వానంగా ఉండేవి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ నిధులు రూ.60లక్షలు మంజూరు చేయడంతో రోడ్లు నిర్మించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
– పార్వతీపురం టౌన్
సాఫీగా ప్రయాణం
గతంలో వ్యాపారం నిమిత్తం ఈ రోడ్డుపై ప్రయాణం చేసేవాడిని. రహదారి సరిగాలేక వ్యాపారం మానుకునే పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈరోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగుతోంది. మళ్లీ వ్యాపారం ప్రారంభించాను. – గణేష్, బట్టల వ్యాపారస్తుడు, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment