Asphalt roads
-
స్టోన్ క్రషర్‌ను తొలగించాల్సిందే..
బిచ్కుంద: తమ గ్రామ సమీపంలోని స్టోన్ క్రషర్‌ను తొలగించాలని, కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ సమీపంలో సుమారుగా ఏడేళ్లుగా ఎల్లయ్య అండ్ సన్స్ స్టోన్ క్రషర్, డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ కొనసాగుతోంది. అది ప్రస్తుతం ఐదు హెక్టార్లలో ఉంది. తొమ్మిది హెక్టార్లలో క్రషర్ నిర్వాహణకు అనుమతి కోరుతూ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంది. దీంతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ శుక్రవారం గ్రామానికి వచ్చారు. గ్రామస్తులతో సమావేశమై చర్చించారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు వెంకటేశ్ ధోత్రె అన్నారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ.. స్టోన్ క్రషర్‌తో బ్లాస్టింగ్, అనుమతి లేని డాంబర్ మిక్సింగ్ ప్లాంట్‌తో కాలుష్యం పెరిగిపోయి గ్రామంలో ఐదుగురు వ్యక్తులు క్యాన్సర్‌తో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పారు. గ్రామానికి ఆరు వంద మీటర్ల దూరంలో క్రషర్, మిక్సింగ్ ప్లాంట్ ఉన్నాయని, వీటిని తొలగించాలని గతంలో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశామన్నారు. తిరిగి రెండోసారి అనుమతి ఇవ్వమమని, తొలగిస్తామని అధికారులు, క్రషర్ నిర్వాహకులు హామీ ఇచ్చారని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్‌కు తెలిపారు. క్రషర్‌ను తొలగించాలని ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. అనుమతి రద్దు చేసే వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ప్లాంట్ తమ ప్రాణాలను తీస్తోందని, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ప్లాంట్ తొలగించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నకిలీ సామాజిక కార్యకర్తల నిలదీత ప్రజాభిప్రాయ సేకరణలో నకిలీ సామాజిక కార్యకర్తలు క్రషర్‌తో పర్యావరణానికి ముప్పు లేదని, అనుమతికి అనుకూలంగా అభిప్రాయాలు ఇచ్చారు. దీంతో గ్రామ యువకులు వారిని పట్టుకొని ని లదీశారు. అందులో కొందరు నకిలీ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల పేరుతో చెలామణి అవుతు న్న వారు ఉన్నారు. వారిని క్రషర్ నిర్వాహకుడు తీ సుకొచ్చారు. దీంతో కొంత సేపు ప్రజాభిప్రాయ సే కరణలో గందరగోళం ఏర్పడింది. అక్కడి నుంచి వారు కార్లలో పారిపోయే యత్నం చేయగా యువ కులు అడ్డుకున్నారు. నకిలీ సామాజిక కార్యకర్తల అభిప్రాయాలను వీడియోలో నుంచి తొలగించాలని పట్టుబట్టారు.అధికారులు, ఎస్సై శ్రీధర్‌రెడ్డి సముదాయించడంతో యువకులు శాంతించి కార్ల ను వదిలేశారు. గ్రామస్తులు తెలియజేసిన అభిప్రా యాలు, వినతులను పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర కమిటీ, సంబంధిత శాఖా అధికారులకు నివేదిక పంపించి అందరికి న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ హామీనిచ్చారు. మైనింగ్, పర్యావరణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనారోగ్యంతో చనిపోతున్నారు స్టోన్ క్రషర్, డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ మా గ్రామానికి ఆరు వందల మీటర్ల దూరంలో ఉంది. పొగ, దుమ్ము, బ్లాస్టింగ్లతో ప్రజలు అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. అనుమతి ఇవ్వవద్దని కోరుతున్నాము. అనుమతి ఇస్తే గ్రామ ప్రజల సూచనల మేరకు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. – శ్రీనివాస్, సర్పంచ్ గోపన్‌పల్లి -
నాడు అధ్వానం..నేడు అద్భుతం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్లె దారుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడచూసినా సిమెంట్, తారురోడ్లు అందంగా దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అంతరాయం లేకుండా రోడ్లపై ప్రజలు, వాహనచోదకులు ప్రయాణం సాగిస్తున్నారు. సీతానగరం మండలం బూర్జ, గరుగుబిల్లి మండలం అజ్జాడ రహదారి గతంలో రోడ్లు ఆధ్వానంగా ఉండేవి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ నిధులు రూ.60లక్షలు మంజూరు చేయడంతో రోడ్లు నిర్మించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. – పార్వతీపురం టౌన్ సాఫీగా ప్రయాణం గతంలో వ్యాపారం నిమిత్తం ఈ రోడ్డుపై ప్రయాణం చేసేవాడిని. రహదారి సరిగాలేక వ్యాపారం మానుకునే పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈరోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగుతోంది. మళ్లీ వ్యాపారం ప్రారంభించాను. – గణేష్, బట్టల వ్యాపారస్తుడు, పార్వతీపురం -
సిగరెట్ పీకలతో తారురోడ్లు!
పొగ తాగితే ఆరోగ్యానికి చేటని అందరికీ తెలిసిన విషయమే కానీ.. సిగరెట్ల పీకల వల్ల పర్యావరణానికి ముప్పని ఎంతమందికి తెలుసు? అవును ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు ఆరు లక్షల కోట్ల సిగరెట్ పీకలు నదులు, సముద్రాల్లోకి చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయి. త్వరలో ఈ పరిస్థితిని మార్చేస్తామంటున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎలాగంటే సిగరెట్ పీకలను వేడి తారులో కలిపినప్పుడు వాటిల్లోని ప్రమాదకరమైన రసాయనాలు తప్పించుకునే పరిస్థితి ఉండదని, ఫలితంగా రహదారి ఏర్పాటుకయ్యే ఖర్చు, కాలుష్యం తగ్గుతాయని చెప్పారు. పైగా సిగరెట్ పీకలను ఉపయోగించి వేసిన రోడ్లపై వేడి కొంచెం తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ అబ్బాస్ మోహజెరాని అంటున్నారు. దీంతోపాటు కొన్ని ఇతర రంగాల్లోనూ సిగరెట్ పీకలను వాడవచ్చునని అబ్బాస్ తెలిపారు. -
‘తారు’లో తిరకాసు!
ఖజానాకు చిల్లుపెట్టేందుకు అధికారుల వ్యూహం కాంట్రాక్టర్లకు రూ.33 కోట్లు దోచిపెట్టేందుకు ఎత్తుగడ రోడ్ల నిర్మాణంలో స్టోన్డస్ట్కు బదులు సిమెంట్ కలపాలని నిబంధన కమీషన్ల దందా పెంచుకునేందుకేనని వెల్లువెత్తుతున్న ఆరోపణలు హైదరాబాద్: తారు రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు పంచాయతీరాజ్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు! గతంలో ఎన్నడూ లేని విధంగా నిబంధనల్లో సరికొత్త మెలిక పెట్టారు. బీటీ తయారీలో స్టోన్ డస్ట్‌కు బదులు సిమెంట్ కలపాలంటూ పేర్కొన్నారు. తద్వారా రాష్ట్ర సర్కారుపై రూ. 33 కోట్ల అదనపు భారం మోపారు. ఆర్ అండ్ బీ రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లు సైతం పంచాయతీరాజ్ రోడ్లు చేపట్టేందుకు క్యూ కడుతున్న తీరు చూస్తే ఈ తారు తిరకాసులో ఏం జరిగిందో తేలిపోతుంది. కమీషన్ల దందా పెంచుకునేందుకే అధికారులు ఈ జిమ్మిక్కులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని నిబంధన... ఎంఆర్ఆర్ గ్రాంటు నిధులతో రాష్ట్రంలో 12,006 కిలోమీటర్ల రోడ్డు పనులకు ప్రభుత్వం గతేడాది నవంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు రూ.1,766.92 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే బీటీ రోడ్లకు సంబంధించి పాటించాల్సిన నిబంధనల తయారీ డేటాలో ఇంజనీరింగ్ అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు శాతం సిమెంట్‌ను జత చేయాలని పేర్కొన్నారు. సాధారణంగా బీటీ మిశ్రమంలో రెండు శాతం స్టోన్ డస్ట్‌ను కలుపుతారు. రాష్ట్రంలోని బీటీ ప్లాంట్లన్నింటా ఇదే తీరుగా బీటీ మిశ్రమం తయారవుతోంది. ఆర్ అండ్ బీతోపాటు గతంలో పంచాయతీరాజ్ రోడ్లన్నింటా ఇదే నిబంధన అమల్లో ఉంది. రూ.2,500 ఖర్చయ్యే డస్ట్ బదులుగా రూ.30 వేల విలువయ్యే సిమెంట్ ధరతో అదనపు భారం పెరిగిపోయింది. కానీ సిమెంట్ మిశ్రమంతో ఈ ఖర్చు ప్రతి కిలోమీటరుకు దాదాపు రూ.27,500 చొప్పున పెరిగిపోతుంది. రాష్ట్రంలో మండలాలవారీగా అనుమతించిన ప్యాకేజీ పనులను లెక్కగగితే... దాదాపు రూ.33 కోట్ల అంచనా వ్యయం పెరిగిపోతోంది. అంతమేరకు సర్కారుకు కుచ్చుటోపీ పెట్టినట్లేనని స్పష్టమవుతోంది. నాణ్యత అంతంతే... బీటీలో స్టోన్ డస్ట్‌ను కలిపినా సిమెంట్ కలిపినా నాణ్యత విషయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన రోడ్డు పనుల్లో సిమెంట్ ఉపయోగించిన దాఖలాలు లేవు. మరోవైపు పనులు జరిగాక బీటీ మిశ్రమంలో సిమెంట్ కలిపారా, డస్ట్ కలిపారా అనేది గుర్తించటం అసాధ్యమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అనుచిత నిబంధనలతో అంచనా వ్యయాన్ని పెంచినందుకు ప్రతి కాంట్రాక్టరు నుంచి అంతమేరకు కమీషన్లు పెంచుకోవాలనేది ఇంజనీరింగ్ అధికారుల ఎత్తుగడగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక అధికారి కింది స్థాయి ఉద్యోగుల నుంచి డివిజన్‌కు రూ. 2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు గుప్పుమంటోంది. వీటితోపాటు సీఆర్ఆర్ నిధులతో మంజూరైన పనులకు సైతం డివి జన్లవారీగా వసూళ్ల పర్వం జోరందుకుంది.