బిచ్కుంద: తమ గ్రామ సమీపంలోని స్టోన్ క్రషర్‌ను తొలగించాలని, కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ సమీపంలో సుమారుగా ఏడేళ్లుగా ఎల్లయ్య అండ్ సన్స్ స్టోన్ క్రషర్, డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ కొనసాగుతోంది. అది ప్రస్తుతం ఐదు హెక్టార్లలో ఉంది. తొమ్మిది హెక్టార్లలో క్రషర్ నిర్వాహణకు అనుమతి కోరుతూ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంది. దీంతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ శుక్రవారం గ్రామానికి వచ్చారు. గ్రామస్తులతో సమావేశమై చర్చించారు.
అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు వెంకటేశ్ ధోత్రె అన్నారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ.. స్టోన్ క్రషర్‌తో బ్లాస్టింగ్, అనుమతి లేని డాంబర్ మిక్సింగ్ ప్లాంట్‌తో కాలుష్యం పెరిగిపోయి గ్రామంలో ఐదుగురు వ్యక్తులు క్యాన్సర్‌తో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పారు. గ్రామానికి ఆరు వంద మీటర్ల దూరంలో క్రషర్, మిక్సింగ్ ప్లాంట్ ఉన్నాయని, వీటిని తొలగించాలని గతంలో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశామన్నారు.
తిరిగి రెండోసారి అనుమతి ఇవ్వమమని, తొలగిస్తామని అధికారులు, క్రషర్ నిర్వాహకులు హామీ ఇచ్చారని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్‌కు తెలిపారు. క్రషర్‌ను తొలగించాలని ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. అనుమతి రద్దు చేసే వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ప్లాంట్ తమ ప్రాణాలను తీస్తోందని, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ప్లాంట్ తొలగించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
నకిలీ సామాజిక కార్యకర్తల నిలదీత
ప్రజాభిప్రాయ సేకరణలో నకిలీ సామాజిక కార్యకర్తలు క్రషర్‌తో పర్యావరణానికి ముప్పు లేదని, అనుమతికి అనుకూలంగా అభిప్రాయాలు ఇచ్చారు. దీంతో గ్రామ యువకులు వారిని పట్టుకొని ని లదీశారు. అందులో కొందరు నకిలీ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల పేరుతో చెలామణి అవుతు న్న వారు ఉన్నారు. వారిని క్రషర్ నిర్వాహకుడు తీ సుకొచ్చారు. దీంతో కొంత సేపు ప్రజాభిప్రాయ సే కరణలో గందరగోళం ఏర్పడింది.
అక్కడి నుంచి వారు కార్లలో పారిపోయే యత్నం చేయగా యువ కులు అడ్డుకున్నారు. నకిలీ సామాజిక కార్యకర్తల అభిప్రాయాలను వీడియోలో నుంచి తొలగించాలని పట్టుబట్టారు.అధికారులు, ఎస్సై శ్రీధర్‌రెడ్డి సముదాయించడంతో యువకులు శాంతించి కార్ల ను వదిలేశారు. గ్రామస్తులు తెలియజేసిన అభిప్రా యాలు, వినతులను పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర కమిటీ, సంబంధిత శాఖా అధికారులకు నివేదిక పంపించి అందరికి న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ హామీనిచ్చారు. మైనింగ్, పర్యావరణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో చనిపోతున్నారు
స్టోన్ క్రషర్, డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ మా గ్రామానికి ఆరు వందల మీటర్ల దూరంలో ఉంది. పొగ, దుమ్ము, బ్లాస్టింగ్‌లతో ప్రజలు అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. అనుమతి ఇవ్వవద్దని కోరుతున్నాము. అనుమతి ఇస్తే గ్రామ ప్రజల సూచనల మేరకు రిలే నిరాహార దీక్షలు చేస్తాం.
– శ్రీనివాస్, సర్పంచ్ గోపన్‌పల్లి
Comments
Please login to add a commentAdd a comment