Stone Crusher
-
స్టోన్ క్రషర్‌ను తొలగించాల్సిందే..
బిచ్కుంద: తమ గ్రామ సమీపంలోని స్టోన్ క్రషర్‌ను తొలగించాలని, కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ సమీపంలో సుమారుగా ఏడేళ్లుగా ఎల్లయ్య అండ్ సన్స్ స్టోన్ క్రషర్, డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ కొనసాగుతోంది. అది ప్రస్తుతం ఐదు హెక్టార్లలో ఉంది. తొమ్మిది హెక్టార్లలో క్రషర్ నిర్వాహణకు అనుమతి కోరుతూ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంది. దీంతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ శుక్రవారం గ్రామానికి వచ్చారు. గ్రామస్తులతో సమావేశమై చర్చించారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు వెంకటేశ్ ధోత్రె అన్నారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ.. స్టోన్ క్రషర్‌తో బ్లాస్టింగ్, అనుమతి లేని డాంబర్ మిక్సింగ్ ప్లాంట్‌తో కాలుష్యం పెరిగిపోయి గ్రామంలో ఐదుగురు వ్యక్తులు క్యాన్సర్‌తో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పారు. గ్రామానికి ఆరు వంద మీటర్ల దూరంలో క్రషర్, మిక్సింగ్ ప్లాంట్ ఉన్నాయని, వీటిని తొలగించాలని గతంలో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశామన్నారు. తిరిగి రెండోసారి అనుమతి ఇవ్వమమని, తొలగిస్తామని అధికారులు, క్రషర్ నిర్వాహకులు హామీ ఇచ్చారని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్‌కు తెలిపారు. క్రషర్‌ను తొలగించాలని ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. అనుమతి రద్దు చేసే వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ప్లాంట్ తమ ప్రాణాలను తీస్తోందని, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ప్లాంట్ తొలగించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నకిలీ సామాజిక కార్యకర్తల నిలదీత ప్రజాభిప్రాయ సేకరణలో నకిలీ సామాజిక కార్యకర్తలు క్రషర్‌తో పర్యావరణానికి ముప్పు లేదని, అనుమతికి అనుకూలంగా అభిప్రాయాలు ఇచ్చారు. దీంతో గ్రామ యువకులు వారిని పట్టుకొని ని లదీశారు. అందులో కొందరు నకిలీ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల పేరుతో చెలామణి అవుతు న్న వారు ఉన్నారు. వారిని క్రషర్ నిర్వాహకుడు తీ సుకొచ్చారు. దీంతో కొంత సేపు ప్రజాభిప్రాయ సే కరణలో గందరగోళం ఏర్పడింది. అక్కడి నుంచి వారు కార్లలో పారిపోయే యత్నం చేయగా యువ కులు అడ్డుకున్నారు. నకిలీ సామాజిక కార్యకర్తల అభిప్రాయాలను వీడియోలో నుంచి తొలగించాలని పట్టుబట్టారు.అధికారులు, ఎస్సై శ్రీధర్‌రెడ్డి సముదాయించడంతో యువకులు శాంతించి కార్ల ను వదిలేశారు. గ్రామస్తులు తెలియజేసిన అభిప్రా యాలు, వినతులను పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర కమిటీ, సంబంధిత శాఖా అధికారులకు నివేదిక పంపించి అందరికి న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ హామీనిచ్చారు. మైనింగ్, పర్యావరణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనారోగ్యంతో చనిపోతున్నారు స్టోన్ క్రషర్, డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ మా గ్రామానికి ఆరు వందల మీటర్ల దూరంలో ఉంది. పొగ, దుమ్ము, బ్లాస్టింగ్లతో ప్రజలు అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. అనుమతి ఇవ్వవద్దని కోరుతున్నాము. అనుమతి ఇస్తే గ్రామ ప్రజల సూచనల మేరకు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. – శ్రీనివాస్, సర్పంచ్ గోపన్‌పల్లి -
స్టోన్ క్రషర్ల కాలుష్యంపై సుప్రీంలో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : అనంతపురం జిల్లా నేమికల్లు, ఉంతకల్లులో గ్రామాల్లో స్టోన్ క్రషర్లు కారణంగా విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందని హీరోజీరావు అనే రైతు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్టోన్ క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము కారణంగా పంట పొలాలకు నష్టం జరుగుతోందని.. ప్రజలు, పశువులు రోగాల బారిన పడుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులను మండించడంతో వెలువడే ఉద్గారాల కాలుష్యం ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొటున్నారని తెలిపారు. కాలుకాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలు పాటించకుండా నడుస్తున్న స్టోన్ క్రషర్లు జనావాసాలను సైతం దుమ్మూ ధూళితో కప్పేస్తున్నాయని పేర్కొన్నారు. క్రషర్లు, క్వారీల యజమానులు పీసీబీ నిబంధనలను లెక్క చేయటం లేదన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు చెందిన జాయింట్ కమిటీచే వెంటనే క్రషింగ్ యూనిట్లను తనిఖీ చేసి, చుట్టు ప్రక్కల గ్రామాలను సందర్శించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తనిఖీ బృదానికి అన్ని రకాల సహాయసహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్‌కు అదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. -
క్రషర్ పేలి ఒకరి మృతి
వరంగల్: అనుమతిలేని క్రషర్లో సంభవించిన పేలుళ్ల కారణంగా కార్మికుడు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగుట్ట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజు(34) ఉదయం క్రషర్లో పని చేస్తుండగా ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, కార్మికులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. గూడెప్పాడు గ్రామం వద్ద రహదారిపై మృతదేహంతో సహా రాస్తారోకో నిర్వాహించారు. -
బతుకు బండలు
మేడికొండూరు, న్యూస్‌లైన్: మేడికొండూరు మండలం పేరేచర్లకు రెండు దశాబ్దాల కిందట తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి సుమారు నాలుగు వేల మంది కార్మికులు వచ్చారు. స్థానిక క్వారీల్లో పనులు చేసుకుంటూ అక్కడే చిన్నపాటి పాకలు వేసుకుని జీవిస్తున్నారు. స్టోన్ క్రషర్లకు మెటీరియల్ అందించటమే వీరిపని. రోజంతా దంపతులు కష్టపడితే కేవలం 200 రూపాయలు చేతికి వస్తుంది. వీరి పిల్లలకు చదువంటే ఏమిటో తెలియదు. ఎంతోమంది బాల కార్మికులు సైతం కొండ క్వారీలలో రాళ్లు మోస్తూ, ట్రాక్టర్లకు లోడు చేస్తూ, ట్రాక్టర్లు తోలుతూ తమ బతుకులు బండలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాధికారులు సైతం వీరి గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రాణాలు పోయినా పట్టదు.. కొండరాళ్లను మలాట్లతో కొట్టి పిండి చేయటం మినహా మిగతా పనులేవీ ఇక్కడి కార్మికులకు తెలియవు. ప్రమాదంలో దెబ్బలు తగిలినా, ప్రాణాలు పోయినా వారి యజమానులు గుట్టుచప్పుడు కాకుండా ఆ కుటుంబానికి ఐదువేలో.. పదివేలో ముట్టజెప్పి చేతులు దులుపుకుంటారు. బీమా పథకాలు ఈ కార్మికులకు అసలు వర్తించవు. బీమా అంటే ఏమిటో యజమానులు తెలియనివ్వరు. ఇరవై ఏళ్లుగా ఇక్కడే స్థిరంగా ఉంటున్న వీరికి స్థానికంగా ఓట్లు ఉన్నాయి. రేషన్ కార్డులూ ఉన్నాయి. తమ క్వారీలో 100 మంది ఓటర్లు వున్నారని చెప్పుకుని ఎన్నికలప్పుడు మాత్రం యజమానులు రాజకీయ నాయకుల వద్ద హవా కొనసాగిస్తారు. పేరేచర్ల పరిసర ప్రాంతాల్లో షుమారు 70 స్టోన్‌క్రషర్లు నడుస్తున్నాయి. క్వారీ కార్మికుని చేతిలోమలాట్ ఆడకపోతే స్టోన్‌క్రషర్ యజమానులు లబోదిబోమనాల్సిందే. ఏ గ్రామంలో రోడ్డు వేయాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా క్వారీ కార్మికుడు కొట్టిన రాయితోనే పనులు జరగాల్సి వుంది. ఇంతటి కష్టం చేస్తున్నా తమ బతుకు గురించి పట్టించుకునేవారే కరువయ్యారని క్వారీ కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. కుటుంబం గడవటం లేదు.. పొద్దుపొడిచిన దగ్గర నుంచి సాయంత్రం వర కూ కొండరాళ్లను ముక్క లు చేస్తాం. యూనిట్‌కు 200 రూపాయలు మాత్ర మే చెల్లిస్తున్నారు. యూని ట్ కొట్టాలంటే భార్యాభర్తలకు ఒకరోజు పడుతుంది. రూ.200 తో పిల్లలను, తల్లిదండ్రులను పోషించుకోవాలంటే ఈ రోజుల్లో భారంగా మారింది. - శ్రీనివాసరావు, తమిళ కార్మికుడు కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి.. క్వారీలలో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాలకు చెంది న తామందరిని ప్రభుత్వం ఆదుకోవాలి. సంక్షే మ పథకాలు, బీమా సౌ కర్యాలు తమకు వర్తించే విధంగా చర్యలు చేపట్టాలి. మా బిడ్డల బతుకులు మా బతుకుల్లా బండపాలు కాకూడదు. బడిలో చదివించే ఏర్పాటు చేయాలి. - సంజయ్ క్వారీ కార్మికుడు