మేడికొండూరు, న్యూస్‌లైన్: మేడికొండూరు మండలం పేరేచర్లకు రెండు దశాబ్దాల కిందట తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి సుమారు నాలుగు వేల మంది కార్మికులు వచ్చారు. స్థానిక క్వారీల్లో పనులు చేసుకుంటూ అక్కడే చిన్నపాటి పాకలు వేసుకుని జీవిస్తున్నారు. స్టోన్ క్రషర్‌లకు మెటీరియల్ అందించటమే వీరిపని. రోజంతా దంపతులు కష్టపడితే కేవలం 200 రూపాయలు చేతికి వస్తుంది. వీరి పిల్లలకు చదువంటే ఏమిటో తెలియదు. ఎంతోమంది బాల కార్మికులు సైతం కొండ క్వారీలలో రాళ్లు మోస్తూ, ట్రాక్టర్‌లకు లోడు చేస్తూ, ట్రాక్టర్‌లు తోలుతూ తమ బతుకులు బండలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాధికారులు సైతం వీరి గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.
ప్రాణాలు పోయినా పట్టదు..
కొండరాళ్లను మలాట్‌లతో కొట్టి పిండి చేయటం మినహా మిగతా పనులేవీ ఇక్కడి కార్మికులకు తెలియవు. ప్రమాదంలో దెబ్బలు తగిలినా, ప్రాణాలు పోయినా వారి యజమానులు గుట్టుచప్పుడు కాకుండా ఆ కుటుంబానికి ఐదువేలో.. పదివేలో ముట్టజెప్పి చేతులు దులుపుకుంటారు. బీమా పథకాలు ఈ కార్మికులకు అసలు వర్తించవు. బీమా అంటే ఏమిటో యజమానులు తెలియనివ్వరు. ఇరవై ఏళ్లుగా ఇక్కడే స్థిరంగా ఉంటున్న వీరికి స్థానికంగా ఓట్లు ఉన్నాయి. రేషన్ కార్డులూ ఉన్నాయి. తమ క్వారీలో 100 మంది ఓటర్లు వున్నారని చెప్పుకుని ఎన్నికలప్పుడు మాత్రం యజమానులు రాజకీయ నాయకుల వద్ద హవా కొనసాగిస్తారు.
పేరేచర్ల పరిసర ప్రాంతాల్లో షుమారు 70 స్టోన్‌క్రషర్లు నడుస్తున్నాయి. క్వారీ కార్మికుని చేతిలోమలాట్ ఆడకపోతే స్టోన్‌క్రషర్ యజమానులు లబోదిబోమనాల్సిందే. ఏ గ్రామంలో రోడ్డు వేయాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా క్వారీ కార్మికుడు కొట్టిన రాయితోనే పనులు జరగాల్సి వుంది. ఇంతటి కష్టం చేస్తున్నా తమ బతుకు గురించి పట్టించుకునేవారే కరువయ్యారని క్వారీ కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
కుటుంబం గడవటం లేదు..
పొద్దుపొడిచిన దగ్గర నుంచి సాయంత్రం వర కూ కొండరాళ్లను ముక్క లు చేస్తాం. యూనిట్‌కు 200 రూపాయలు మాత్ర మే చెల్లిస్తున్నారు. యూని ట్ కొట్టాలంటే భార్యాభర్తలకు ఒకరోజు పడుతుంది. రూ.200 తో పిల్లలను, తల్లిదండ్రులను పోషించుకోవాలంటే ఈ రోజుల్లో భారంగా మారింది. - శ్రీనివాసరావు, తమిళ కార్మికుడు
కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి..
క్వారీలలో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాలకు చెంది న తామందరిని ప్రభుత్వం ఆదుకోవాలి. సంక్షే మ పథకాలు, బీమా సౌ కర్యాలు తమకు వర్తించే విధంగా చర్యలు చేపట్టాలి. మా బిడ్డల బతుకులు మా బతుకుల్లా బండపాలు కాకూడదు. బడిలో చదివించే ఏర్పాటు చేయాలి. - సంజయ్ క్వారీ కార్మికుడు
బతుకు బండలు
Published Mon, Dec 30 2013 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement
Advertisement