విశాఖ ఉక్కు కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన | Visakha Steel Workers Protest Demanding Payment Of Pending Salaries | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కు కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

Published Tue, Jan 14 2025 11:27 AM | Last Updated on Tue, Jan 14 2025 8:40 PM

Visakha Steel Workers Protest Demanding Payment Of Pending Salaries

సాక్షి, విశాఖపట్నం: పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికుల (vizag steel) అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. జీతాలు లేకపోతే పండగ ఎలా చేసుకోవాలంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు.

మరో వైపు, కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరతీసింది. కార్మికుల్ని సాగనంపేందుకు సిద్ధమైంది. వీఆర్ఎస్‌ పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్‌లో 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు వీఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. తద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.

అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది.  అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్‌లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.

దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో  మాట్లాడేందుకు అపాయింట్మెంట్‌ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు.  దసరాకు బోనస్ , దీపావళికి జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఆర్‌ఎస్‌ పేరుతో యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్

ఇదీ చదవండి: పల్లె కన్నీరు పెడుతోందో
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement