క్రషర్ పేలి ఒకరి మృతి | blast at stone crusher.. one died | Sakshi
Sakshi News home page

క్రషర్ పేలి ఒకరి మృతి

Published Sun, May 31 2015 4:31 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

blast at stone crusher.. one died

వరంగల్: అనుమతిలేని క్రషర్‌లో సంభవించిన పేలుళ్ల కారణంగా కార్మికుడు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగుట్ట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజు(34) ఉదయం క్రషర్‌లో పని చేస్తుండగా ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, కార్మికులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. గూడెప్పాడు గ్రామం వద్ద రహదారిపై మృతదేహంతో సహా రాస్తారోకో నిర్వాహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement