అధికారులతో జూపల్లి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో మంజూరైన సిమెంట్ రహదారుల నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని అధికా రులను పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఉపాధి హామీ కింద జరుగు తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగ తిపై మంగళవారం ఆయన సమీక్షించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని వృథా కాకుండా సద్వినియోగం చేయాలని సూచించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం లోనూ పెద్దెత్తున ఉపాధి పనులు చేపట్టేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అధికారులు సమాయత్తం కావాలన్నారు. ప్రపంచవ్యా ప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంత్రి జూపల్లి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిం చారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.