
ప్రముఖ సినీ నిర్మాత, సంతోషం అధినేత కొండేటి సురేష్ గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఫిలింనగర్ దైవసన్నిదానంలో శనివారం నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలంలో పాల్గొన్న ఆయన ’ 19 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గణపతి చేతిలో పూజలందుకున్న లడ్డూ తనకు దక్కడం సంతోషంగా ఉందని, ప్రతియేటా తాను లడ్డూ వేలం పాటలో పాల్గొని లడ్డూను దక్కించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఆలయ కోశాధికారి కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment