
షకలక శంకర్
హాస్య నటుడు ‘షకలక’ శంకర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘శంభో శంకర’. కారుణ్య కథానాయిక. శ్రీధర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. టీజర్ 50లక్షల వ్యూస్ వైపు దూసుకెళుతోంది. ‘దిల్’ రాజు వంటి అగ్ర నిర్మాత మా సినిమా టీజర్‌ని ప్రశంసించారంటే ఫలితం ఊహించవచ్చు. మా చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ టాక్ వినిపించడం హ్యాపీ’’ అన్నారు. ‘‘శంకర్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నమిది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతాడన్న ధీమా ఉంది’’ అన్నారు నిర్మాత సురేష్ కొండేటి.