
హాస్యనటుడు శంకర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘శంభో శంకర’. కారుణ్య కథానాయిక. శ్రీధర్.ఎన్ దర్శకత్వంలో ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో ఆర్.ఆర్. పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ– ‘‘కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. డైరెక్టర్ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తయింది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి’’ అన్నారు. ‘‘దర్శకునిగా నా తొలిచిత్రం ‘శంభో శంకర’. నిర్మాతల సహకారం వల్లే సినిమా అనుకున్నట్టుగా తీశా.
పాటలు, ఫైట్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు దర్శకుడు శ్రీధర్. ‘‘ఇప్పటి వరకూ కమెyì యన్‌గా అలరించిన శంకర్ ఈ చిత్రంలో నట విశ్వరూపం చూపిస్తాడు. సెంటిమెంట్ సీన్స్‌లో అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తాడు. మేలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు మరో నిర్మాత సురేష్ కొండేటి. ఈ సినిమాకు సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: రాజశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment