
శ్రీధర్, కారుణ్య, శంకర్, హరీశ్ శంకర్, రమణారెడ్డి, సురేశ్ కొండేటి
‘షకలక’ శంకర్, కారుణ్య జంటగా శ్రీధర్ ఎన్. దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘శంభో శంకర’. ఆర్.ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె పిక్చర్స్ సమర్పణలో వై.రమణా రెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను హరీశ్ శంకర్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘ఆఫీస్‌బాయ్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు శంకర్. ‘గబ్బర్‌సింగ్’ సినిమాకు అద్భుతమైన స్కెచ్‌లు గీశాడు శంకర్. ఈ చిత్రాన్ని 35 రోజుల్లో కంప్లీట్ చేయడం గ్రేట్. ఆ విషయంలో చిత్రబృందాన్ని అభినందిస్తున్నా’ అన్నారు.
శంకర్ మాట్లాడుతూ – ‘అందరూ ఎక్సర్‌సైజులు చేసి తగ్గాను అనుకుంటున్నారు. రెండేళ్లు సినిమా చాన్సులు లేక తిండిలేక తగ్గిపోయాను (నవ్వుతూ). ఆ సమయంలో ఈ అవకాశం వచ్చింది. నా వంతు ప్రయత్నం చేశాను. ప్రేక్షకుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా. దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’ అన్నారు.
‘శంకర్‌ని దృష్టిలో పెట్టుకునే చేశాను. నా నెక్ట్స్ సినిమా కూడా తనతోనే ఉంటుంది. పాటలు, కెమెరా అన్నీ బాగా కుదిరాయి. టీమ్ సహకారంతో మంచి సినిమా తీయగలిగాం’’ అన్నారు శ్రీధర్. ‘‘సినిమాలపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్‌కి నచ్చుతుంది’ అన్నారు రమణారెడ్డి. ‘కథ నచ్చడంతో నేను కూడా ఇందులో పార్టనర్ అయ్యాను. శంకర్ అద్భుతంగా నటించాడు’ అన్నారు సురేశ్ కొండేటి.
Comments
Please login to add a commentAdd a comment