వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ‘రియల్ దండుపాళ్యం’ | Real Dandupalyam Movie Trailer Out | Sakshi
Sakshi News home page

వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ‘రియల్ దండుపాళ్యం’

Published Tue, Jan 11 2022 5:25 PM | Last Updated on Tue, Jan 11 2022 5:25 PM

Real Dandupalyam Movie Trailer Out - Sakshi

రామ్ ధ‌న్ మీడియా వ‌ర్క్స్  స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వైష్ణో దేవి ప‌తాకంపై   రాగిణి  ద్వివేది, మేఘ‌న రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన చిత్రం `రియ‌ల్ దండుపాళ్యం`. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో సి.పుట్ట‌స్వామి,  రామ్‌ధ‌న్ మీడియా వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా రామ్‌ధ‌న్ మీడియా వ‌ర్క్స్  రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ని ప్ర‌ముఖ పాత్రికేయులు, నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేశారు. 

అనంత‌రం సురేష్ కొండేటి మాట్లాడుతూ...``దండుపాళ్యం సిరీస్ తెలుగు, క‌న్న‌డ భాషల్లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  వాటిని మించేలా `రియ‌ల్ దండుపాళ్యం` చిత్రం ఉండ‌బోతుంద‌ని  ట్రైల‌ర్ చూశాక అర్థ‌మైంది. రాగిణి ద్వివేది అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రియ‌ల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాల్మీకి ఈ చిత్రంతో సినిమా రంగంలో కూడా స‌క్సెస్ సాధించి మరెన్నో చిత్రాలు నిర్మించాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

రామ్ ధ‌న్ మీడియా వ‌ర్క్స్ అధినేత వాల్మీకి మాట్లాడుతూ...``తెలుగు, క‌న్న‌డ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ స‌క్సెస్ అయిన‌ సంగ‌తి తెలిసిందే.  ఇప్పుడు వాటన్నింటినీ మించేలా `రియ‌ల్ దండుపాళ్యం ఉండ‌బోతుంది`. సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’.అన్ని సెంట‌ర్స్ లో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది’అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement