
కెమిస్ట్రీ కేక!
మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’లో తమ కెమిస్ట్రీతో కుర్రకారును గిలిగింతలు పెట్టిన దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ల జోడి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారు. మలయాళంలో అన్వర్ రషీద్ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని ‘జతగా’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి విడుదల చేయనున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర విశేషాలను వెల్లడించారు. ‘‘లవ్, సెంటిమెంట్.. ఇలా అన్ని భావోద్వేగాలు ఉన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. నిత్యామీనన్, దుల్కర్‌ల జోడీ మళ్లీ ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వండర్‌ఫుల్‌గా ఉంటుంది. గోపీ సుందర్ సంగీతం, సాహితీ సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.లోకనాథన్.