అల్లరి నరేష్ సినిమాలా ఉండే మహేష్
అల్లరి నరేష్ సినిమాలా ఉండే మహేష్
Published Fri, Sep 20 2013 12:20 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM
‘‘నేనిప్పటివరకూ ఎనిమిది సినిమాలు విడుదల చేశాను. మన తెలుగు హీరో ఉన్న సినిమా అయితే బాగుంటుందనుకుంటున్న సమయంలో శర్వానంద్ నటించిన ‘జర్నీ’ని రిలీజ్ చేయడం ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు మరో తెలుగు హీరో సందీప్‌కిషన్ నటించిన సినిమాని అందించడం ఇంకా ఆనందంగా ఉంది’’ అన్నారు సురేష్ కొండేటి.
సందీప్‌కిషన్, డింపుల్ చోపడే జంటగా మదన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘యారుడా మహేష్’. ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్‌తో కలిసి ఎస్.కె. పిక్చర్స్ ద్వారా ‘మహేష్’ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు సురేష్. మారుతి సమర్పకుడు. సమన్యరెడ్డి సహనిర్మాత. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. సురేష్ మాట్లాడుతూ -‘‘మంచి కథ, మాటలు, పాటలు కుదిరాయి.
ముఖ్యంగా చిన్నారాయణ రాసిన ‘మది మోసే..’ పాట ఆడియో చార్ట్‌బస్టర్‌లో ఫస్ట్ బెస్ట్ సాంగ్‌గా నిలిచింది. ఏపీలో నాలుగు వందల థియేటర్లకు పైగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. సందీప్ మాట్లాడుతూ-‘‘ఈ చిత్రం టైటిల్‌కి ‘అల్లరి నరేష్ ఫిల్మ్’ అని ట్యాగ్‌లైన్ పెడితే బాగుంటుందని, నరేష్‌తో అన్నాను. ఎందుకంటే ఇది నరేష్ సినిమాల్లా ఉంటుంది’’ అన్నారు.
Advertisement