dimple chopade
-
స్టైలిష్ రాయుడు
శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోతలరాయుడు’. డింపుల్ చోపడే, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్ దర్శకత్వం వహిస్తున్నారు. అవారు సదానంద్ కిషోర్, కోలన్ వెంకటేశ్ నిర్మించారు. రెండు పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. శనివారం శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించారు టీమ్. ‘‘ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ అలరిస్తుంది. సుధీర్ అద్భుతంగా తెరకెక్కించారు’’ అని శ్రీకాంత్ అన్నారు. ‘‘దర్శకుడిగా ‘రయ్.. రయ్’ నా తొలి చిత్రం. ఇది రెండోది. ఈ చిత్రంలో శ్రీకాంత్ స్టైలిష్‌గా కనిపిస్తారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. డీజే వసంత్ మంచి సంగీతాన్ని అందించారు. కెమెరామేన్ బుజ్జి విజువల్స్ బాగా వచ్చాయి. ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు సుధీర్‌బాబు. పోసాని కృష్ణమురళి, పృథ్వీ, చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, మురళీశర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. -
కోతల రాయుడు
శ్రీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘కోతల రాయుడు’. ‘కృష్ణాష్టమి’ ఫేమ్ డింపుల్ చోపడే, ‘జై సింహా’ ఫేమ్ నటాషా దోషి కథానాయికలు. ‘జయహే’ సినిమాని తెరకెక్కించిన సుధీర్ రాజు దర్శకత్వంలో వెంకటరమణ మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ నం. 1గా కొలన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈ నెల 16న మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రాజమండ్రి, బెంగుళూరులో అధిక భాగం చిత్రీకరణ జరపనున్నాం. ఆగస్టు చివరి వారంలో షూటింగ్ పూర్తి అవుతుంది’’ అన్నారు. షాయాజి షిండే, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, ‘సత్యం’ రాజేష్, పృథ్వీ, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీలక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు సంగీతం: డి.జె. వసంత్, కెమెరా: సతీష్. జి, సహ నిర్మాత: సిరాజ్ వి. వెంకట్ రావు. -
తుంగభద్ర మూవీ స్టిల్స్
-
'తుంగభద్ర' ఆడియో ఆవిష్కరణ
-
ప్రేమించడానికి టైమ్ లేదు
ప్రేమించడానికి టైమ్ లేదంటోంది మరాఠీ బ్యూటీ డింపుల్ చోపాడే. ఆరంభంలోనే తమిళం, తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషల్లో చుట్టేస్తున్న ఈ అమ్మడు చెన్నైని మాత్రం బాగా ప్రేమిస్తోందట. మరి ఈమె గురించి కాస్త తెలుసుకుందాం. సినిమా పరిచయం గురించి? నేను మరాఠీ థియేటర్ ఆర్టిస్ట్‌ను. ఇదే సినీ రంగ ప్రవేశానికి తొలిమెట్టు. మరాఠీ నాటకాల్లో నటించడం చాలామంది చూశారు. అలా తొలుత కన్నడ చిత్ర పరిశ్రమలో తొలి అవకాశం వచ్చింది. అక్కడ బనిముత్తు అనే చిత్రంలో నటించాను. అది తొలి చిత్రం అయినా మొదట విడుదలైంది మాత్రం కోడె చిత్రం. ఆ తరువాత కన్నడంలో ఐదు చిత్రాలు, తమిళంలో యారుడా మహేశ్, కల్‌కండు, తెలుగులో రొమాన్స్ తదితర చిత్రాల్లో నటించాను. నేను మరాఠీ మోడల్ ఆర్టిస్ట్‌ను కావడంతో సినిమాల్లో చాలా గౌరవం లభిస్తోంది. ఏ భాష అయినా సంభాషణలు అర్థం చేసుకుని నటించగలుగుతున్నాను. నిజం చెప్పాలంటే నాటక రంగం సినిమాల్లో నటించడానికి చాలా హెల్ప్ అయ్యింది. సినిమా కోసం శిక్షణ పొందారా? సినిమానే జీవితంగా భావించినప్పుడు దాని గురించి కొంచెం అయినా తెలుసుకోవాలని ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ, గుర్రపు స్వారీ తదితర నటనకు ఏమేమి కావాలో అన్నీ నేర్చుకున్నాను. బీఏ చదవడం కూడా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చెన్నైలో మకాం పెడతారా? నేను చెన్నైని ప్రేమిస్తున్నాను. దక్షిణాదిలో తమిళ చిత్రాల్లోనే హీరోయిన్లకు నటనతో సత్తా చాటుకునే అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. నా వద్దకు కన్నడం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నా తమిళంలో వైవిధ్య భరిత చిత్రాలను చేయాలని ఆశిస్తున్నాను. వరుసగా మంచి అవకాశాలు వస్తే ఇక్కడే సెటిలవుతాను. డ్రీమ్ రోల్ అంటూ ఏమైనా ఉందా? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి. అంకిత భావంతో నటించాలి. దర్శకుడు చెప్పినట్లు నటిస్తే చాలని భావిస్తాను. ఇక నా మనసులోని మాట చెప్పాలంటే యాక్షన్ కథా పాత్రలో నటించాలనే కోరిక ఉంది. అందుకే మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి వాటిల్లో శిక్షణ పొందాను. విజయశాంతి నటించిన యాక్షన్ చిత్రాలు తరచూ చూస్తుంటాను. పోరా ట దృశ్యాల్లో ఆమె ఎలా నటించారో గమనిస్తాను. అదే విధంగా మూండ్రాం పిరై చిత్రం అంటే చాలా ఇష్టం. ఆ చిత్రంలో శ్రీదేవి పోషించిన పాత్ర లాంటిది చేయాలన్న ఆకాంక్ష ఉంది. బాయ్‌ఫ్రెండ్స్ ప్రేమ ఉన్నాయా? చిత్ర రంగంలోనూ, బయట కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఇప్పటి వరకు నేనెవరినీ ప్రేమించలేదు. అందుకు తగిన సమయం కూడా లేదు.మూడు భాషల్లో బిజీగా ఉన్నాను. -
అల్లరి నరేష్ సినిమాలా ఉండే మహేష్
‘‘నేనిప్పటివరకూ ఎనిమిది సినిమాలు విడుదల చేశాను. మన తెలుగు హీరో ఉన్న సినిమా అయితే బాగుంటుందనుకుంటున్న సమయంలో శర్వానంద్ నటించిన ‘జర్నీ’ని రిలీజ్ చేయడం ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు మరో తెలుగు హీరో సందీప్‌కిషన్ నటించిన సినిమాని అందించడం ఇంకా ఆనందంగా ఉంది’’ అన్నారు సురేష్ కొండేటి. సందీప్‌కిషన్, డింపుల్ చోపడే జంటగా మదన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘యారుడా మహేష్’. ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్‌తో కలిసి ఎస్.కె. పిక్చర్స్ ద్వారా ‘మహేష్’ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు సురేష్. మారుతి సమర్పకుడు. సమన్యరెడ్డి సహనిర్మాత. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. సురేష్ మాట్లాడుతూ -‘‘మంచి కథ, మాటలు, పాటలు కుదిరాయి. ముఖ్యంగా చిన్నారాయణ రాసిన ‘మది మోసే..’ పాట ఆడియో చార్ట్‌బస్టర్‌లో ఫస్ట్ బెస్ట్ సాంగ్‌గా నిలిచింది. ఏపీలో నాలుగు వందల థియేటర్లకు పైగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. సందీప్ మాట్లాడుతూ-‘‘ఈ చిత్రం టైటిల్‌కి ‘అల్లరి నరేష్ ఫిల్మ్’ అని ట్యాగ్‌లైన్ పెడితే బాగుంటుందని, నరేష్‌తో అన్నాను. ఎందుకంటే ఇది నరేష్ సినిమాల్లా ఉంటుంది’’ అన్నారు. -
మహేష్ ఎవరు?
‘‘ఈ సినిమాలో హీరో పేరు మహేష్ కాదు. కానీ సినిమా అంతా మహేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అసలింతకూ మహేష్ ఎవరు? అదే ఈ సినిమాకు మెయిన్. సందీప్ కిషన్ పాత్ర చిత్రణ అద్భుతంగా ఉంటుంది’’ అని దర్శకుడు ఆర్.మదన్ కుమార్ చెప్పారు. సందీప్‌కిషన్, డింపుల్‌చోపడే జంటగా తమిళంలో రూపొంది ఘనవిజయం సాధించిన ‘యారుడా మహేష్’ తెలుగులో ‘మహేష్’గా వస్తోంది. గుడ్ సినిమా గ్రూప్‌తో కలిసి ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘‘ఇటీవల విడుదలైన పాటలకు విశేషాదరణ లభిస్తోంది. మలయాళంలో ఫేమస్ మ్యూజిక్ డెరైక్టర్ అయిన గోపీసుందర్ మంచి స్వరాలిచ్చారు. యువతకు నచ్చే అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయి. ఫక్తు కమర్షియల్ సినిమా ఇది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఉదయ్, పాటలు: భాస్కరభట్ల, వన మాలి, పులగం చిన్నారాయణ, విశ్వ, సహనిర్మాత: సమన్యరెడ్డి. -
ఈ ఈలలూ కేకలూ విని ఎగ్జయిటయ్యాను
కన్నడంలో ఐదు చిత్రాలు, తమిళంలో ఓ సినిమా.. తెలుగులో ఒక సినిమా చేసిన డింపుల్ చోపడే భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నారు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోయినా, సినిమా పరిశ్రమ తనను అక్కున చేర్చుకుందంటున్నారామె. ఇటీవల విడుదలైన ‘రొమాన్స్’లో కథానాయికగా నటించిన డింపుల్, త్వరలో ‘మహేష్’ చిత్రం ద్వారా మరోసారి తెలుగు తెరపై కనిపించబోతున్నారు. అలాగే తెలుగులో రెండు సినిమాలు అంగీకరించారు. ఈ సందర్భంగా డింపుల్ మాట్లాడుతూ -‘‘తెలుగులో ‘రొమాన్స్’ నాకు మంచి లాంచింగ్ అనిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన రోజునే పబ్లిక్ థియేటర్‌కెళ్లి చూశాను. నా ఇంట్రడక్షన్ సీన్‌కి ప్రేక్షకులు ఈలలు, కేకలు వేశారు. కన్నడంలో ఐదు సినిమాలు చేసినప్పటికీ తెలుగుకి నేను కొత్త. అందుకే ఆ ఈలలు, కేకలు విని ఎగ్జయిట్ అయ్యాను. తెలుగులో నాకు మంచి భవిష్యత్తునిచ్చిన సినిమా ఇది’’ అన్నారు. ఎలాంటి సినిమాలు చేయాలని ఉందనే విషయం గురించి చెబుతూ -‘‘నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏవీ లేవు. కాకపోతే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌లో, డీ-గ్లామరైజ్డ్ రోల్స్ చేయాలని ఉంది. బేసిక్‌గా నేను రంగస్థల నటిని. పుణెలో పలు నాటకాల్లో నటించాను. అలాగే ముంబైలో గణేష్ ఆచార్యగారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను’’ అన్నారు. నేటి తరం హీరోయిన్లు కథ డిమాండ్ చేస్తే బికినీ వేసుకోవడానికి కూడా వెనుకాడటంలేదు? మరి మీ సంగతేంటి? అనే ప్రశ్నకు -‘‘నా శరీరాకృతికి బికినీ సూట్ అవ్వదని నా ఫీలింగ్. అందుకని బికినీకి నో చెప్పేస్తా’’ అని చెప్పారు డింపుల్.