స్టైలిష్‌ రాయుడు | kothala rayudu movie updates | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌ రాయుడు

Published Sun, Mar 24 2019 2:13 AM | Last Updated on Sun, Mar 24 2019 2:13 AM

kothala rayudu movie updates - Sakshi

శ్రీకాంత్‌

శ్రీకాంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోతలరాయుడు’. డింపుల్‌ చోపడే, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అవారు సదానంద్‌ కిషోర్, కోలన్‌ వెంకటేశ్‌ నిర్మించారు. రెండు పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. శనివారం శ్రీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించారు టీమ్‌. ‘‘ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ అలరిస్తుంది. సుధీర్‌ అద్భుతంగా తెరకెక్కించారు’’ అని శ్రీకాంత్‌ అన్నారు.

‘‘దర్శకుడిగా ‘రయ్‌.. రయ్‌’ నా తొలి చిత్రం. ఇది రెండోది. ఈ చిత్రంలో శ్రీకాంత్‌ స్టైలిష్‌గా కనిపిస్తారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. నిర్మాతలు కాంప్రమైజ్‌ కాకుండా నిర్మిస్తున్నారు. డీజే వసంత్‌ మంచి సంగీతాన్ని అందించారు. కెమెరామేన్‌ బుజ్జి విజువల్స్‌ బాగా వచ్చాయి. ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు సుధీర్‌బాబు. పోసాని కృష్ణమురళి, పృథ్వీ, చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, మురళీశర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement