మహేష్ ఎవరు?
మహేష్ ఎవరు?
Published Fri, Aug 23 2013 1:21 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM
‘‘ఈ సినిమాలో హీరో పేరు మహేష్ కాదు. కానీ సినిమా అంతా మహేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అసలింతకూ మహేష్ ఎవరు? అదే ఈ సినిమాకు మెయిన్. సందీప్ కిషన్ పాత్ర చిత్రణ అద్భుతంగా ఉంటుంది’’ అని దర్శకుడు ఆర్.మదన్ కుమార్ చెప్పారు. సందీప్‌కిషన్, డింపుల్‌చోపడే జంటగా తమిళంలో రూపొంది ఘనవిజయం సాధించిన ‘యారుడా మహేష్’ తెలుగులో ‘మహేష్’గా వస్తోంది.
గుడ్ సినిమా గ్రూప్‌తో కలిసి ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘‘ఇటీవల విడుదలైన పాటలకు విశేషాదరణ లభిస్తోంది.
మలయాళంలో ఫేమస్ మ్యూజిక్ డెరైక్టర్ అయిన గోపీసుందర్ మంచి స్వరాలిచ్చారు. యువతకు నచ్చే అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయి. ఫక్తు కమర్షియల్ సినిమా ఇది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఉదయ్, పాటలు: భాస్కరభట్ల, వన మాలి, పులగం చిన్నారాయణ, విశ్వ, సహనిర్మాత: సమన్యరెడ్డి.
Advertisement
Advertisement