ఈ ఈలలూ కేకలూ విని ఎగ్జయిటయ్యాను
ఈ ఈలలూ కేకలూ విని ఎగ్జయిటయ్యాను
Published Tue, Aug 6 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
కన్నడంలో ఐదు చిత్రాలు, తమిళంలో ఓ సినిమా.. తెలుగులో ఒక సినిమా చేసిన డింపుల్ చోపడే భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నారు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోయినా, సినిమా పరిశ్రమ తనను అక్కున చేర్చుకుందంటున్నారామె. ఇటీవల విడుదలైన ‘రొమాన్స్’లో కథానాయికగా నటించిన డింపుల్, త్వరలో ‘మహేష్’ చిత్రం ద్వారా మరోసారి తెలుగు తెరపై కనిపించబోతున్నారు. అలాగే తెలుగులో రెండు సినిమాలు అంగీకరించారు.
ఈ సందర్భంగా డింపుల్ మాట్లాడుతూ -‘‘తెలుగులో ‘రొమాన్స్’ నాకు మంచి లాంచింగ్ అనిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన రోజునే పబ్లిక్ థియేటర్‌కెళ్లి చూశాను. నా ఇంట్రడక్షన్ సీన్‌కి ప్రేక్షకులు ఈలలు, కేకలు వేశారు. కన్నడంలో ఐదు సినిమాలు చేసినప్పటికీ తెలుగుకి నేను కొత్త. అందుకే ఆ ఈలలు, కేకలు విని ఎగ్జయిట్ అయ్యాను. తెలుగులో నాకు మంచి భవిష్యత్తునిచ్చిన సినిమా ఇది’’ అన్నారు.
ఎలాంటి సినిమాలు చేయాలని ఉందనే విషయం గురించి చెబుతూ -‘‘నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏవీ లేవు. కాకపోతే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌లో, డీ-గ్లామరైజ్డ్ రోల్స్ చేయాలని ఉంది. బేసిక్‌గా నేను రంగస్థల నటిని. పుణెలో పలు నాటకాల్లో నటించాను. అలాగే ముంబైలో గణేష్ ఆచార్యగారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను’’ అన్నారు. నేటి తరం హీరోయిన్లు కథ డిమాండ్ చేస్తే బికినీ వేసుకోవడానికి కూడా వెనుకాడటంలేదు? మరి మీ సంగతేంటి? అనే ప్రశ్నకు -‘‘నా శరీరాకృతికి బికినీ సూట్ అవ్వదని నా ఫీలింగ్. అందుకని బికినీకి నో చెప్పేస్తా’’ అని చెప్పారు డింపుల్.
Advertisement
Advertisement