సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్ టాక్ ద్వారా యూత్ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యేవారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం "టిక్ టాక్" ను బ్యాన్ చేసింది. దీంతో యువత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా "రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి "మీ 4 టిక్ టిక్" యాప్ ను ప్రముఖులు, యువత సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్ చేసింది. ట్యాలెంటెడ్ యూత్ కు 'ME 4 టిక్ టిక్' యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని "ME 4 Tic Tic" యాప్ ఇండియా సీఈవో డీసతీష్ రెడ్డి వెల్లడించారు. అన్ని రకాల కంటెంట్ తో అందరినీ అలరిస్తుందన్నారు.
ముఖ్యంగా స్వదేశీంలో భారత ఐటీ యువత రూపొందించిన "ME 4 టిక్ టిక్" హైలీ సెక్యూర్డ్ యాప్ అనీ ఇందులో ఉండే డేటా చాలా సేఫ్ అని కంపెనీ వెల్లడించింది. ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ భాగస్వామ్యంతో అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ యాప్ ఉంటుందని, ఒక భారతీయుడిగా ఇండియాలో ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా యాప్ రూపొందించిన టీంకు కృతజ్ఞతలు తెలిపిన పలువురు, యాప్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇదివరకు సినిమాలో ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో ఫోటో షూట్ చూసి సెలెక్ట్ చేసేవారమనీ, సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది దర్శక, నిర్మాతలకు ఇపుడు ఆ పని ఈజీ అయ్యిందని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ నిర్మాత సురేష్ కొండేటి వ్యాఖ్యానించారు. టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన "ME4 టిక్ టిక్" యాప్ పెద్ద సక్సెస్ అవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment