గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్.. వీడియో రిలీజ్‌ చేసిన శ్రీలీల | Santosham Suresh Kondeti met GOA CM for Santosham South Indian Film Awards 22nd Anniversary | Sakshi
Sakshi News home page

గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్.. వీడియో రిలీజ్‌ చేసిన శ్రీలీల

Published Sat, Oct 14 2023 1:09 AM | Last Updated on Sat, Oct 14 2023 12:11 PM

Santosham Suresh Kondeti met GOA CM for Santosham South Indian Film Awards 22nd Anniversary - Sakshi

సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిలిం అవార్డుల వేడుక డిసెంబరు 2న గోవాలో జరగనుంది. సంతోషం 22వ ‘సౌత్‌ ఇండియన్‌ ఫిలిం అవార్డులు– 2023’ వేడుక గోవాలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఇండోర్‌ స్టేడియంలో జరగనున్నట్లు, జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హీరోయిన్‌ శ్రీలీల ఓ వీడియోలో వెల్లడించారు.

ఇక గోవాలోని బాంబోలిం బీచ్ కు అతి చేరువలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఇక అదే సమయంలో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 150 దేశాల నుంచి సినీ ప్రేమికులు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక ఆ దేశాల సినీ ప్రేమికులు, మన ఇండియన్ సినీ లవర్స్ మోహరించి ఉన్న గోవాలో వేలాది ప్రేక్షకుల మధ్య సంతోషం 22వ సౌత్ ఇండియన్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు నిర్వాహకుడు, ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్‌ కొండేటి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement