Santosham south indian film awards
-
గోవాలో ఘనంగా సంతోషం అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్.. వీడియో రిలీజ్ చేసిన శ్రీలీల
సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక డిసెంబరు 2న గోవాలో జరగనుంది. సంతోషం 22వ ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులు– 2023’ వేడుక గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరగనున్నట్లు, జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హీరోయిన్ శ్రీలీల ఓ వీడియోలో వెల్లడించారు. ఇక గోవాలోని బాంబోలిం బీచ్ కు అతి చేరువలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఇక అదే సమయంలో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 150 దేశాల నుంచి సినీ ప్రేమికులు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక ఆ దేశాల సినీ ప్రేమికులు, మన ఇండియన్ సినీ లవర్స్ మోహరించి ఉన్న గోవాలో వేలాది ప్రేక్షకుల మధ్య సంతోషం 22వ సౌత్ ఇండియన్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు నిర్వాహకుడు, ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్ కొండేటి పేర్కొన్నారు. Exciting news for all the film enthusiasts! 🎥 The Goa Santosham South Indian Film Awards 2023 is just 50 days away, and it's happening on December 2nd at Dr. Shyama Prasad Mukherjee Indoor Stadium, Goa. Can't wait to see what our favorite stars bring to the stage. Mark your… pic.twitter.com/zpvcBrr7aF — Suresh Kondeti (@santoshamsuresh) October 13, 2023 -
సంతోషం అవార్డ్స్‌లో తళుక్కుమన్న తారలు
-
నన్ను మోసం చేసి లాక్ చేశాడు
‘‘నాకు అవార్డు ఇస్తానంటే వేడుకకు రాను..ఇవ్వనంటేనే వస్తానని సురేశ్‌కి ముందే చెప్పా. కానీ, నన్ను మోసం చేసి గానకోకిల ఎస్.జానకిగారి చేతులమీదుగా అవార్డు బహూకరించి నన్ను లాక్ చే సేశాడు. కాదనలేక ఈ అవార్డు తీసుకుంటున్నా’’ అని హీరో చిరంజీవి అన్నారు. 16వ ‘సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం’ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సింగపూర్‌లో ఓ అవార్డుల కార్యక్రమంలో జానకిగారు, నేను కలిసాం. మళ్లీ ‘సంతోషం’ వేడుకల్లోనే కలిసాం. తొలిసారి ఆమె చేతుల మీదుగా ‘సంతోషం’ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇందుకు సురేశ్‌కి థ్యాంక్స్. మరొకరి చేతుల మీదుగా అవార్డు ఇచ్చుంటే తిరస్కరించేవాణ్ని. ఎందుకంటే ఇలాంటి అవార్డులు కొత్త వారికి ఇచ్చి ప్రోత్సహిస్తే వాళ్లలో ఉత్సాహం నింపినట్లు ఉంటుంది’’ అన్నారు. మరో ముఖ్య అతిథి గాయని ఎస్. జానకి మాట్లాడుతూ– ‘‘సురేశ్ 5 ఏళ్ల నుంచి ఫంక్షన్‌కు రావాలని అడుగుతున్నా కుదరక రాలేకపోయా. ఈసారి కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకుని వచ్చా. ఇక్కడ చిరంజీవిగార్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమాల్లోని అప్పటి హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నావే. ఆయన 125 ఏళ్లు సంతోషంగా జీవించాలి. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా చూసా. పాత చిరంజీవిని చూసినట్లే ఉంది’’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్లగా సురేశ్ ఒక్కడే అన్నీ తానై ఈ వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం. సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో ఎందరో పెద్దల కృషి ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడుగారులాంటి వల్ల సాధ్యమైంది’’ అన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందించారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్‌బాబు, కె.ఎల్ నారాయణ, నటులు రాజేంద్ర పసాద్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, ప్రసన్న, దర్శకుడు, నటుడు టి. రాజేందర్, రచయిత సాయిమాధవ్ బుర్రా, కథానాయికలు తమన్నా, మెహరీన్, ఈషా, స్నేహ, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి, నృత్యదర్శకుడు శేఖర్ మాస్టర్, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా రాధాకృష్ణ, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణాది సినీసీమకు... ఆగస్టులో ‘సంతోషం’
సినిమా ఇండస్ట్రీలోని ప్రతిభావంతులకు ప్రతి ఏటా అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది ‘సంతోషం’ వారపత్రిక. ఈ పత్రిక ఆగస్టు 2న పధ్నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని, పదిహేనో ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఆగస్టు 14న హైదరాబాద్‌లో ‘సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’ వేడుకలు నిర్వహిస్తోంది. పత్రిక అధినేత, ఎడిటర్ సురేశ్ కొండేటి మాట్లాడుతూ- ‘‘తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమ ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం. నాటి- మేటి నటీనటులు, టెక్నీషియన్స్ ఈ వేడుకలకు వస్తారు. తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని భాషల టాప్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరవుతారు’’ అని చెప్పారు.