ప్రేమిస్తే మమ్మల్ని నిలబెట్టింది | 'Jathaga': Watch promo song of Dulquer Salmaan-Nithya | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తే మమ్మల్ని నిలబెట్టింది

Published Tue, Oct 13 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

ప్రేమిస్తే మమ్మల్ని నిలబెట్టింది

ప్రేమిస్తే మమ్మల్ని నిలబెట్టింది

 ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణంలో, బాలాజీ శక్తివే ల్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కాదల్’ను ‘ప్రేమిస్తే’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మారుతి మాట్లాడుతూ -‘‘ఈ రోజు మేం ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం ‘ప్రేమిస్తే’. ఈ సినిమా కన్నా ముందు వేరే చిత్రాన్ని కొందరితో కలిసి 35 లక్షల్లో నిర్మించి న ష్టపోయాం.
 
 అప్పుడు ‘కాదల్’ను ‘ప్రేమిస్తే’ పేరుతో తెలుగులో విడుదల చేస్తే ఈ సినిమా మమ్మల్ని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది’’ అన్నారు. ‘‘సంతోషం రెండో వార్షికోత్సవ వేడుకల్లో చిరంజీవిగారు నేను నిర్మాతగా మారితే చూడాలని ఉందన్నారు. ఆయన స్ఫూర్తితోనే మారుతితో కలిసి ‘ప్రేమిసే’ చిత్రాన్ని విడుదల చేశా. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. అదే న మ్మకంతో మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’ను తెలుగులో ‘జతగా’ పేరుతో త్వరలో విడుదల చేయనున్నా’’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు అనిల్ రావిపూడి, కల్యాణ్‌కృష్ణ, మల్లికార్జున్, గాయకుడు గంగాధర్‌శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement