
అన్యాయాల్ని ప్రశ్నించే డాక్టర్
‘‘ ‘ఠాగూర్’ చిత్రంలో లాగే ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తుందీ చిత్రం. నా గత చిత్రాల్లోలాగే ఇందులోనూ సందేశం ఉంటుంది’’ అని నిర్మాత సురేశ్ కొండేటి తెలిపారు. విజయ్ ఆంటోని, అక్ష జంటగా ఎన్.వి. నిర్మల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డా. సలీమ్’. సురేశ్ కొండేటి, తమటం కుమార్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పాటల సీడీని ఇటీవల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించి, ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.