మనసులను తాకే ప్రేమించాలి
స్ట్రయిట్ చిత్రాలను తలపించే అనువాద చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. నేటివిటీతో సంబంధం లేని చిత్రాలైతే, ‘డబ్బింగ్’ అని ఇట్టే తెలిసిపోతుంది.
స్ట్రయిట్ చిత్రాలను తలపించే అనువాద చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. నేటివిటీతో సంబంధం లేని చిత్రాలైతే, ‘డబ్బింగ్’ అని ఇట్టే తెలిసిపోతుంది. సురేష్ కొండేటి అందించినవన్నీ అనువాద చిత్రాలే అయినా, స్ట్రయిట్ చిత్రాలేమో అనే ఫీల్‌ని కలగజేస్తాయి. దానికి కారణం ఆయన ఏ సినిమా విడుదల చేసినా, అది తెలుగు నేటివిటికీ దగ్గరగా ఉండటమే. ప్రేమిస్తే... షాపింగ్‌మాల్, జర్నీ,
నాన్న, పిజ్జా.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలను అందించిన సురేష్ తాజాగా తమిళంలో సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులో ఈ నెలలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడతూ -‘‘మా సంస్థ నుంచి వస్తున్న పదో చిత్రం ఇది. ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథాచిత్రాలకు భిన్నంగా ఉంటుంది. యువతరం మనోభావాలకు అద్దం పట్టేలా సుశీంద్రన్ ఈ చిత్రాన్ని మలిచారు. మనసుల్ని తాకే భావోద్వేగాలతో పాటు, చక్కని సందేశం కూడా ఉంటుంది.
ఇప్పటివరకూ మా సంస్థ నుంచి వచ్చిన చిత్రాలన్నింటికీ దాదాపుగా క్లీన్ యు సర్టిఫికెట్టే రావడం గమనార్హం. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు మా నుంచి వస్తాయనడానికి ఇదే నిదర్శనం. యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా తప్పక ఆకట్టుకుంటుంది’’ అన్నారు. సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించిన ఈ చిత్రంలో జయప్రకాష్, పూర్ణిమా జయరామ్, తులసి, కామ్‌నాథ్‌శెట్టి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య ఎ.ఆర్, ఎడిటింగ్: ఆంటోని, సహ నిర్మాత: సమన్యరెడ్డి.