రేపు సంతోషం సౌత్ ఫిలిం అవార్డ్స్ వేడుక | Tomorrow is the joy of the South Film Awards Ceremony | Sakshi
Sakshi News home page

రేపు సంతోషం సౌత్ ఫిలిం అవార్డ్స్ వేడుక

Published Fri, Aug 29 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

రేపు సంతోషం సౌత్ ఫిలిం అవార్డ్స్ వేడుక

రేపు సంతోషం సౌత్ ఫిలిం అవార్డ్స్ వేడుక

సిటీ బ్యూరో: ‘‘ పన్నెండేళ్లుగా పాఠకుల ఆదరాభిమానాలు పొందుతూ ‘సంతోషం’ పత్రిక విజయవంతంగా కొనసాగుతోంది. ఎంతో ఉత్సాహంతో పదమూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అలాగే, పదకొండేళ్లుగా ‘సంతోషం’ ఫిల్డ్ అవార్ట్స్ వేడుకను ఘనంగా చేస్తున్నాం. శనివారం పన్నెండో సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుకను మరింత వైభవంగా చేయబోతున్నాం.

జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ వేడుక జరుగుతుంది’’ అని ‘సంతోషం’ సినీ వారపత్రిక అధినేత సురేష్ కొండేటి చెప్పారు. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలువురు చిత్రరంగ ప్రముఖులు పాల్గొంటారన్నారు. పలు హిట్ సాంగ్స్‌కు ఆరుగురు కథానాయికలు డాన్స్ చేస్తారన్నారు.

డాన్స్ మాస్టర్ జానీ ఆధ్వర్యంలో  ప్రాక్టీస్ జరుగుతోందన్నా రు. కామెడీ స్కిట్స్‌తో పాటు రకరకాల ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. అవార్డు వేడుకకు సంబంధించిన ట్రైలర్‌ను శ్రద్ధాదాస్, షీల్డ్‌ను జానీ మాస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మీనాక్షీ దీక్షిత్, ఎస్తేర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement