సాక్షి, చెన్నై: దర్శకుడు బాలాజీ శక్తివేల్ వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా మనీషాయాదవ్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ డైరెక్టర్ అలా చెప్పి ఉండాల్సింది కాదు. నన్ను ఆయన మోసం చేశారని నటి మనీషాయాదవ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మధ్య చెన్నై-28 సీక్వెల్‌లో ఐటమ్ సాంగ్‌కు చిందులేసింది. సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభుపై ఆరోపణలు గుప్పించింది. ఆమె మాట్లాడుతూ.. దర్శకుడు వెంకట్‌ప్రభు నన్ను మోసం చేశారు.
చెన్నై-28 చిత్ర సీక్వెల్‌లో నాకు ఒక పాటతో పాటు చిత్రాన్ని మలు తిప్పే కీలక సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. ముందుగా స్వప్నసుందరి పాటను చిత్రీకరించారు. అదీ స్పెషల్ సాంగ్ అని చెప్పారు. తీరా చిత్రం విడుదలైన తర్వాత చూస్తే అది ఐటమ్ సాంగ్ అని తెలిసింది. అందరూ స్వప్నసుందరి అని పిలుస్తున్నారు. దర్శకుడు ఆ పాటను స్పెషల్ అని చెప్పి ఉండకూడదు. అలా నన్ను వెంకట్ ప్రభు మోసం చేశారు. ఐటమ్ సాంగ్ గర్ల్ అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అని ఒక ఇంటార్య్వూలో పేర్కొంది.
ఈ అమ్మడు మొదట్లో త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో తనతో అసభ్య సంభాషణలు చెప్పించారని, గ్లామరస్‌గా చూపించారని ఈ అమ్మడు ఆ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్‌పై ఫైర్ అయ్యి కలకలం సృష్టించింది. ఆ సినిమాకు ఆమె దాదాపుగా దూరం అయ్యింది. అయినా సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయిన తరువాత ఎప్పుడో మోసం చేశారని ఇప్పుడు గగ్గోలు పెట్టడంలో ప్రయోజనం ఏముంటుందో మనీషాయాదవ్‌నే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment