మనీషాకు బదులు నందిత
మనీషాకు బదులు నందిత
Published Tue, Mar 18 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
కథ మారింది కల చెదిరింది అనే పాటను వర్ధమాన నటి మనీషా యాదవ్ పాడుకునే పరిస్థితి ఎదురైంది. ఈ బ్యూటీ మంచి నటే. ఆమె నటించిన వళక్కు ఎన్ 18/9. ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, జన్నల్ ఓరం వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. అయినా ఒక్కోసారి ఊహించని సంఘటనలు జరుగుతాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడికి దర్శకుడు శ్రీను రామసామి రూపంలో సడన్‌గా బ్రేక్ పడింది. అంతేకాదు ఇది ఆమె కెరీర్‌కు డ్రాబ్యాక్ అనే చెప్పాలి. జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత శీను రామసామి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇదం పొరుళ్ అవళ్.
విజయ్ సేతుపతి, విష్ణు విశాల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మనిషాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జంటగా మని షాకు చిత్రంలో గ్రామీణ యువతి పాత్రకు ఆమె నటన సంతృప్తికరంగా లేదంటూ దర్శకుడు ఆమెను మరో హీరోయిన్ పాత్రలో విష్ణు విశాల్‌కు జంటగా నటించమని అడిగారట. దీనికామె నిరాకరించడంతో ఇప్పుడా పాత్రకు నటి నందిత ఎంపికయ్యారు. ఈమెను ఇంతకు ముందు విష్ణు విశాల్‌కు జంటగా ఇదే చిత్రానికి ఎంపిక చేశారన్నది గమనార్హం. ఇప్పుడు విష్ణు విశాల్ సరసన నటించే నటి కోసం అన్వేషిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు. ఏదోమయినా నటి మనిషా యాదవ్‌కు ఈ సంఘటన పెద్ద దెబ్బేనని చెప్పాలి.
Advertisement
Advertisement