స్కూల్‌కి వెళ్లలేదని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని బయ్యారం మండలంలోని ఇసుకమీదికి గ్రామంలో మంగళవారం జరిగింది. బయ్యారంలో ఒక పాఠశాలలో సంతోష్ 9వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా స్కూల్‌కి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాంప చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతడిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
Published Tue, Dec 1 2015 11:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement