
ములకలపల్లి (అశ్వారావుపేట) : నిత్యం పాఠశాలకు డుమ్మా కొడుతున్న తన కొడుకు ఇలా చేస్తే తోటి పిల్లలను చూసైనా బుద్ధి తెచ్చుకుంటాడనే ఆలోచనతో ఓ తండ్రి బాలుడిని ఇలా స్తంభానికి కట్టేశాడు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురంలో ఓ విద్యార్థి వారం రోజులుగా బడికి వెళ్లడం లేదు. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి.. మిగతా పిల్లలు పాఠశాల నుంచి వచ్చే సమయానికి తన కుమారుడిని స్తంభానికి కట్టేశాడు. దీనిపై స్థానికుల నుంచి విమర్శలు రావటంతో కట్లు విప్పి కొడుకును ఇంటికి తీసుకెళ్లారు. తోటి విద్యార్థులను చూసైనా తన కొడుకులో మార్పు వస్తుందనే ఇలా చేశానంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment