స్కూల్ ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు | students injured in auto accident at khammam district | Sakshi
Sakshi News home page

స్కూల్ ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు

Published Fri, Oct 21 2016 11:26 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

students injured in auto accident at khammam district

వాజేడు: స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామం నుంచి వాజేడు పాఠశాలకు వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగంతో పాటు సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడంతోటే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement