పుట్టిన ఆసుపత్రికి రూ.కోటి మంజూరు | Mp Joginipally Santosh Donate 1 Crore For Hospital Development | Sakshi
Sakshi News home page

పుట్టిన ఆసుపత్రికి రూ.కోటి మంజూరు

Published Sat, Nov 12 2022 3:55 AM | Last Updated on Sat, Nov 12 2022 11:42 AM

Mp Joginipally Santosh Donate 1 Crore For Hospital Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను పుట్టిన పేట్లబురుజు ఆసుపత్రి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయించారు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌. ఈ మేరకు రూ.కోటి మొత్తాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు అందజేశారు.

ఈ సందర్భంగా సంతోష్‌ను మంత్రి అభినందిస్తూ.. ఈ నిధులతో పేట్లబురుజు ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన వారు ఎంపీ స్ఫూర్తితో.. వాటి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హరీశ్‌ విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement