సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘పారిజాత పర్వం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్.
ఓ అమ్మాయికి ముసుగు వేసి కుర్చీలో బంధించినట్లు టైటిల్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న చిత్రం ‘పారిజాత పర్వం’. టైటిల్‌కి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: అనంత సాయి, కెమెరా: బాల సరస్వతి, సంగీతం: రీ.
Comments
Please login to add a commentAdd a comment