గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు జాలర్లు క్షేమంగా ఉన్నారని, వారిని మరికొంతసేపట్లో రక్షించి ఒడ్డుకు తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. వివరాలివీ.. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ధర్మాజీ రాజేష్(28), కూనారపు సంతోష్(30) మరికొందరితో కలసి గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో సాయంత్రం వరకు మిగతా వారంతా తిరుగుముఖం పట్టగా.. వీరిద్దరూ ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతిలో చిక్కుకుపోయారు.