ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరుగుతుందని ఆ యువకుడిపై దాడి చేశాడు.
పిచ్చి ప్రేమికుడు
Published Fri, Mar 31 2017 5:58 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
► అమ్మాయి కోసం కొట్టుకున్న యువకులు
► నిశ్చితార్థం చేసుకున్న యువకుడిని అడ్డగించి దాడిచేసిన పిచ్చి ప్రేమికుడు
► తల్లీ,కూతురికి బెదిరింపులు
► బాధితుడిపైనే కేసు నమోదుచేసిన పోలీసులు
బెంగళూరు(దొడ్డబళ్లాపురం): ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరుగుతుందని ఆ యువకుడిపై దాడి చేశాడు. కిరాయి రౌడీలతో కలిసి దాడిచేసిన సంఘటన తాలూకాలోని హణబె గ్రామంలో చోటుచేసుకుంది.
పార్వతమ్మ గ్రామంలో నివాసం ముంటోంది, ఈమె తన కూతురు రమ్యతో(19) కలిసి జీవిస్తోంది. రమ్య 5 ఏళ్ల నుండి పక్క గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. మధు అనే తన దూరపు బంధువుల యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. రమ్య తనతో చనువుగా ఉంటుందని మధు పార్వతమ్మ ను రమ్య ను తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. మధు మంచివాడు కాకపోవడంతో పార్వతమ్మ రమ్య ప్రేమించిన సంతోష్ కి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుని నిశ్చితార్థం చేసింది. మధు తనను తప్ప ఇంకెవర్ని పెళ్లి చేసుకున్న పార్వతమ్మ ఇంటికి వెళ్లి హెచ్చరించాడు. మధు సంతోష్ ఎలాగైనా హత మార్చాలని సంతోష్ పై రౌడీలతో దాడి చేశాడు. దాడిలో సంతోష్ ఆత్మరక్షణకు మధుపై దాడి చేశాడు.
మధుకు ఆదాడిలో స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు. మధు సంతోష్ యే నాపై దాడి చేశాడని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. సంతోష్ మధు పై కేసు నమోదు చెయ్యడానికి వెళితే ముందే మధు నిపైనా కేసు నమోదు చేశాడని పోలీసులు తెలిపారు. సంతోష్ పార్వతమ్మలు పోలీసులు మధుకు రాజకీయ అండ ఉండటం కారణంగానే ఇలా కేసును తప్పుదోవ పెట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పై దొడ్డబెళవంగల ఎసై రాఘవేంద్ర మాట్లాడుతూ ఇరువైపుల వారి ఫిర్యాదులూ స్వీకరిస్తామని,తమపై ఈ ఘటనకు సంబంధించి ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేసారు.
Advertisement
Advertisement