ప్రకాశం జిల్లా మేదరమెట్ల మండలం తిమ్మనపాళెం గ్రామ శివారులో ద్విచక్రవాహనం ఢీకొని ఎం. సంతోష్(25) అనే క్లీనర్ మృతిచెందాడు.
ప్రకాశం జిల్లా మేదరమెట్ల మండలం తిమ్మనపాళెం గ్రామ శివారులో ద్విచక్రవాహనం ఢీకొని ఎం. సంతోష్(25) అనే క్లీనర్ మృతిచెందాడు. రోడ్డుపక్కన ఆగిఉన్న లారీకి పోసేందుకు నీళ్లు తీసుకెళ్తూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు.