
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ విభాగం ఇన్‌ఛార్జి ఏడీజీగా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏడీజీ వెల్ఫేర్‌గా ఉన్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సౌమ్యా మిశ్రాకు ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్‌లో భాగంగా సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లేందుకు కేంద్రం (డీఓపీటీ ) ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారు. దీంతో తాత్కాలికంగా వెల్ఫేర్ విభాగం బాధ్యతలను సంతోష్ మెహ్రాకు అప్పగించారు. గతంలో ఆయన తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరించారు.