చదువుకుని పని పాటా లేక ఊరు చుట్టూ తిరిగే కుర్రాళ్లు ఇంటికొక్కరైనా ఉంటారు. అలాంటివాళ్ల ప్రేమ పాట్లే అడంగాద పసంగ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక, నిర్మాత సెల్వనాథన్. ఈయన కథ, కథనం, మాటలు రాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవ నటులు గౌతమ్, పావేందర్, సురేష్‌బాబు, సంతోష్, కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. సత్యశ్రీ నాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అదిప్ విలన్‌గాను, వర్ష సింధు, నగీనా, లక్ష్మి, కనక ప్రియ, పైల్‌వాన్ రంగనాథన్, సెల్వనాథన్, మాస్టర్ అరుణ్, మాస్టర్ ఆల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ తరం యువత జీవన విధానాన్ని ఆవిష్కరించే ఇతివృత్తంగా అడంగాద ససంగ చిత్రం ఉంటుందన్నారు. ప్రేమ కారణంగా కలిగే అవమానాలు, సమస్యలను కాస్త వినోదాన్ని జోడించి చూపించామన్నారు. అంతేకాకుండా ప్రేమ మాత్రమే కాకుండా యువకుల్లో మంచి మానవత్వం, ఇతరులకు సాయపడే మనస్థ్వత్వం కూడా ఉంటాయని చెప్పే చిత్రంగా ఈ అడంగాద పసంగ చిత్రం ఉంటుందన్నారు.
అదే విధంగా చిత్రంలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు, ద్వంద్వార్థ సంభాషణలు, పొగపీల్చడం, మద్యం సేవించడం లాంటి సన్నివేశాలుండవని దర్శక, నిర్మాత వెల్లడించారు. తిరుపత్తూర్, తిరువణ్ణామలై, జోలార్‌పేట, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆల్రిన్ - మనీష్ ద్వయం సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని సెన్సార్ బోర్డు సభ్యుడు, నటుడు ఎస్ వి శేఖర్‌కు అందించారు.
నిరుద్యోగుల ప్రేమ కథ
Published Wed, Mar 4 2015 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement
Advertisement